RBI New Rules 2022: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ.. లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఒకప్పుడు డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చేది. పైగా అక్కడ బారులుతీరిన జనం.. ముక్కుతూ మూలుగుతూ మన వంతు వచ్చేసరికి అప్పటికే ఒంట్లో ఉన్న శక్తి మొత్తం అయిపోయేది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం అనివార్యమైంది. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎంల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నా.. అప్పుడప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం అనుమానం అవుతోంది. అయితే ఈ కార్డుల దుర్వినియోగానికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. అదే ‘టోకనైజేషన్’. అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తోంది. అసలు ఏంటీ డెబిట్/క్రెడిట్ కార్డ్ ‘టోకనైజేషన్’.. అక్టోబర్ 1 నుంచి ఎందుకు అమలు చేస్తున్నారన్న దానిపై స్పెషల్ ఫోకస్

_ ఏమిటి ఈ టోకనైజేషన్
సాంకేతిక పరిజ్ఞానం మనుషుల జీవితాన్ని ఎంత సుఖమయం చేసిందో.. అదే స్థాయిలో ఇబ్బందుల పాలు చేస్తున్నది. చెమట చుక్క చిందకుండా, బయట పెట్టకుండా సైబర్ మోసాలు చేసేవారు ఎక్కువయ్యారు.. వీటి ద్వారానే లక్షల లక్షలు సంపాదిస్తున్నారు. వ్యాపారుల వెబ్సైట్లో వినియోగదారుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల సమాచారం అలాగే ఉంటుండడంతో సైబర్ మోసగాళ్లు పండగ చేసుకుంటున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతాలో సొమ్మును లాగి పడేస్తున్నారు. ఇది గుర్తించేలోపే ఖాతాదారులకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకే ఏకంగా సైబర్ సెల్ ఏర్పాటు చేసింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే కార్డుల టోకనైజేషన్ తప్పనిసరి అనే నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెస్తున్నది.. 16 అంకెల కార్డు నెంబర్, పేర్లు, గడువు తేదీలు, కోడ్స్ వంటి సమాచారాన్ని యూనిట్ ఆల్టర్నేట్ కార్డు నెంబర్ లేదా టోకెన్ తో రీప్లేస్ చేస్తారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.
Also Read: JanaSena- YCP Leaders: జనసేన గెలుపునకు వైసీపీ నేతలు సహకారమందిస్తున్నారా?
_ దీనివల్ల ఏంటి ఉపయోగం
ప్రస్తుతం ఏదైనా లావాదేవీ సమయంలో వ్యాపారులు వినియోగదారుల బ్యాంకు కార్డు సమాచారాన్ని తమ తమ కంప్యూటర్ వెబ్సైట్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. అయితే కొందరు హ్యాకర్లు వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఖాతాదారుల సమాచారం సేకరిస్తున్నారు. దీనివల్ల వారికి తెలియకుండానే వారి ఖాతాలో ఉన్న నగదును తస్కరిస్తున్నారు.. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఈ క్రమంలో ఖాతాదారుల ప్రయోజనార్థం వారి కార్డుల సమాచార రక్షణ నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ టోకనైజేషన్ ప్రమాణాలను ఆచరణలో పెడుతోందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. టోకనైజేషన్ నిబంధనలతో రిటైలర్ల వెబ్సైట్ కి బదులు సమాచారం బ్యాంకుల వద్ద నిక్షిప్తం అవుతుంది. అలాగే పదేపదే కార్డు వివరాలను ఎంటర్ చేసే తలనొప్పి కస్టమర్లకు తప్పుతుంది. టోకనైజేషన్ సర్వీసును పొందడానికి ఎవరికి ఎటువంటి చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదు. ఈ టోకనైజేషన్ వల్ల కార్డుకు మరింత రక్షణ ఏర్పడుతుంది. హ్యాకర్లు హాక్ చేసే వీలుండదు. పైగా ఈ సమాచారమంతా కేంద్రీకృత వ్యవస్థలో నిక్షిప్తం కావడం వల్ల అంత సులువుగా హాక్ చేయలేరు.
_ ఇలా చేసుకోవాలి
టోకనైజేషన్ కోసం ఫేవరెట్ అప్లికేషన్/ వెబ్సైట్ ఆన్లైన్ స్టోర్ కి వెళ్ళాలి. చెక్ అవుట్ పేజీపై బ్యాంకు క్రెడిట్/ డెబిట్ కార్డును ఎంచుకోవాలి. ఆపై సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాలి. డ్రాప్ డౌన్ మెనూ నుంచి సెక్యూర్ యువర్ కార్డు లేదా సేవ్ కార్డు యూస్ ఫర్ యాజ్ పర్ ఆర్బిఐ రూల్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ సెల్ ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. దాన్ని ఉపయోగించి మీ కార్డు టోకెన్లైజేషన్ను ఉపయోగించి మీ కార్డు టోకనైజేషన్ ను పూర్తి చేసుకోవచ్చు.. ఆపై యూనిక్ ఆల్టర్నేట్ కార్డ్ నెంబర్ లేదా టోకెన్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. దీనివల్ల ఖాతాదారుల నగదు సురక్షితంగా ఉంటుంది. పైగా ఎటువంటి అవకతవకలు జరిపేందుకు ఆస్కారం ఉండదు. కార్డు విలువ పెరగడం ద్వారా.. ఇతరత్రా అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.
– క్రెడిట్ కార్డుల విషయంలో తస్మాత్ జాగ్రత్త
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం కరుణ మహమ్మారి తర్వాత అనూహ్యస్థాయిలో పెరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం జూలై 2022 నాటికి దేశంలో మొత్తం 8.3 కోట్ల క్రెడిట్ కార్డులు సర్క్యులేషన్ లో ఉన్నాయి. జూలై 2021 తర్వాత ఈ సంఖ్య ఏకంగా 26.5% మేర వృద్ధి చెందింది. అయితే వినియోదారుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న వారే అధికం. ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని కార్డులు ఉండాలి? ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అనే సందేహాలు రావడం సహజం. ఒక వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలనే దానిపై పరిమితి ఏమీ లేదు.. నిజానికి ఒక వ్యక్తికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉండటం సందర్భాన్ని బట్టి ఉపయోగకరమే. ఒకటి నప్పుడు ఇంకోటి వాడుకొనే దానికి వీలుంటుంది.

క్రెడిట్ కార్డుల సంఖ్యను బట్టి వ్యక్తికి రుణ పరిమితి కూడా పెరుగుతుంది. కానీ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నిర్వహణ, సకాలంలో చెల్లింపులు ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదు. పరిమితి ఉంది కదా అని అధిక వ్యయాలకు మొగ్గు చూపితే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. చెల్లింపులు సకాలంలో చేయకపోతే బకాయిలు పెరిగిపోతాయి. తద్వారా సిబిల్ స్కోర్ పడిపోతుంది. కొంతమంది క్రెడిట్ కార్డు యూజర్లకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటాయి.. వాటిని అసలు వాడరు. అలాంటి కార్డులను క్లోజ్ చేయడమే మంచిది. ఇందుకోసం సంబంధిత కస్టమర్ బ్యాంకు కి అధికారికంగా ఒక లేఖ లేదా మెయిల్ పంపించాలి. బ్యాంకు అధికారిక ఈమెయిల్ ఐడిని మాత్రమే సంప్రదించాలి. ఫోన్ కమ్యూనికేషన్ లేదా వాట్స్అప్ బ్యాంకింగ్ సర్వీసులపై అసలు ఆధారపడకూడదు. క్రెడిట్ కార్డు ని క్లోజ్ చేస్తున్నామని బ్యాంకు సమాచారం అందించినప్పుడు మాత్రమే నిర్ధారణ చేసుకోవాలి. క్లోజ్ అయిన 45 రోజుల తర్వాత క్రెడిట్ రిపోర్ట్ కోసం అప్లై చేయాలి. మీ క్రెడిట్ ఎంత అనేది అందులో తేలిపోతుంది. ఏదైనా సమస్య ఉంటే బ్యాంకు ని నేరుగా సంప్రదించాలి. ఇదే సమయంలో హ్యాకర్లు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటిపి వివరాలు అడుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వివరాలు చెప్పకూడదు. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నెట్లో పెట్టకూడదు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. సైబర్ మోసాలు విరివిగా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నది.
Also Read: Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ పాయె…కేంద్రం మోసం.. వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుంది?
[…] […]