Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’.ఈ చిత్రాన్ని మహేష్ సొంత నిర్మాణ సంస్థతో కలిసి 14 రీల్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ స్వరాలను అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది.
అయితే ఈ షూటింగ్ కి మహేష్ తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఒక వైపు సినిమా షూటింగులో పాల్గొంటూనే… మరోవైపు ఫ్యామిలి తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో పూర్తి అయ్యింది. షూటింగ్ చివరి రోజున సినిమా సెట్స్‌లో ఓ అనుకొను అతిధి ప్రత్యక్షమయ్యి అందరికీ షాక్ ఇచ్చారు.
ఆ అతిధి ఎవరో కాదు మహేశ్ భార్య నమ్రత. పాట చిత్రీకరణ జరుగుతున్నా సమయంలో నమ్రత ఆకక్దికి సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం హీరోయిన్ కీర్తి సురేశ్‌తో సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేశారు నమ్రత. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అలాగే ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానున్నట్లు గతం లో ప్రకటించారు. అయితే సంక్రాంతి రేస్ లో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కూడా జాయిన్ అవవ్డంతో సర్కారు వారి పాట చిత్ర విడుదలను పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు బావిస్తున్నారంట. ఈ మేరకు త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం.