Mahesh Babu
Mahesh Babu: మహేష్ బాబు.. ఈ పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్ వినిపిస్తాయి. మిల్క్ స్టార్ మహేష్ అందం, మంచితనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఈయన నటించిన సినిమాలు మిశ్రమ ఫలితాలను మాత్రమే సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమాలో నటించారు మహేష్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా గుంటూరు కారం. ఇందులో ఇద్దరు హీరోయిన్ లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు నటించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. నెగిటివ్ ఫలితాలను సొంతం చేసుకున్నా కూడా థియేటర్ లలో సకెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతుంది గుంటూరు కారం. ఈ సినిమా నెగిటివ్ ఫలితాలను సొంతం చేసుకున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాను ఆదరించారు. పండుగ సందర్భంగా ఫ్యామిలీలు కలిసి థియేటర్లకు వెళ్లడంతో అంతకంతకూ కలెక్షన్లు పెరిగాయి.
5వ రోజు కూడా రెండంకెల పైనే వసూళ్లు సాధించడమే కాకుండా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సొంతం చేసుకొని రికార్డు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. తొలి రోజునే రూ. 94 కోట్ల వసూళ్లను సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. రీజినల్ ఫిల్మ్ కేటగిరిలో ఆల్ టైమ్ రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా 5 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లను సాధించింది ఈ సినిమా. ఇందులో రూ. 100 కోట్లను టాలీవుడ్ లోనే రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన ఏకైక హీరోగా నిలిచారు మహేష్.
వరుసగా 5 సినిమాలు అంటే.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాటు, గుంటూరు కారం సినిమాలు 100 కోట్ల షేర్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మహేష్ స్టామినాను నిరూపించాయి. అయితే ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది.
Web Title: Mahesh babu who owns a rare record it was possible only with guntur curry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com