Mahesh Babu-Trivikram: అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడే కాంబినేషన్ మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్..వీళ్లిద్దరి కలయిక లో గతం లో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కూడా,టీవీ టెలికాస్ట్ ద్వారా విపరీతమైన ప్రేక్షకాదరణ అందుకున్నాయి..మళ్ళీ వీళ్లిద్దరి కలయిక లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అందరు అనుకున్నారు..కానీ వీళ్ళ కాంబినేషన్ లో మూడవ సినిమా పట్టాలెక్కడానికి సుమారు 10 ఏళ్ళు పట్టింది..ఇటీవలే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభమైన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి షెడ్యూల్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ షెడ్యూల్ లో మహేష్ మీద మంచి యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారు..ఇక ఆ తర్వాత మహేష్ గారి తల్లి కాలం చెందడం తో రెండవ షెడ్యూల్ ని ప్రారంభించడానికి కాస్త ఆలస్యం అయ్యింది..ఈ గ్యాప్ లో మహేష్ బాబు విదేశాలకు వెళ్ళాడు..ఈరోజు ఆయన తిరిగి ఇండియా కి వచ్చాడు..త్వరలోనే రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది అని ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగ వంశి ట్వీట్ కూడా వేసాడు.
షూటింగ్ అయితే త్వరలోనే ప్రారంభిస్తాము అని ఈరోజు ప్రకటన చేసారు కానీ..అలా సడన్ గా అనౌన్స్మెంట్ చెయ్యడానికి కూడా ఒక కారణం ఉందని ఇండస్ట్రీ లో గత కొద్దీ రోజుల నుండి ఒక టాక్ వినిపిస్తుంది..అదేమిటి అంటే మహేష్ బాబు కి ఈ సినిమా సెకండ్ హాఫ్ సరిగా నచ్చలేదని..స్క్రిప్ట్ ని మొత్తం ఈ వర్క్ చేసి, పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ తో తన వద్దకి వచ్చినప్పుడే రెండవ షెడ్యూల్ ని ప్రారంబిద్దాము అని..డైలాగ్ వెర్షన్స్ కూడా ముందే రాసుకొని రమ్మని త్రివిక్రమ్ కి చెప్పాడట మహేష్ బాబు.

ఇక త్రివిక్రమ్ తన వల్ల కాక అసిస్టెంట్స్ గా ప్రత్యేమైన టీం ని ఏర్పాటు చేసుకొని స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేస్తున్నాడని..షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదని..రీ వర్క్ చేసిన తర్వాత కూడా మహేష్ బాబు కి కథ నచ్చకపోతే సినిమాని నిలిపివేస్తాడు అంటూ ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది..ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని రూమర్స్ బాగా రావడం తోనే ఈరోజు ఆ చిత్ర నిర్మాత స్పందించాడని..కానీ షూటింగ్ ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వుధి అనేది వాళ్లకి కూడా క్లారిటీ లేదని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న పుకారు.