Homeఎంటర్టైన్మెంట్Samantha- Akkineni Nagarjuna: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ని కలవడానికి వెళ్తున్న అక్కినేని నాగార్జున

Samantha- Akkineni Nagarjuna: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ని కలవడానికి వెళ్తున్న అక్కినేని నాగార్జున

Samantha- Akkineni Nagarjuna: సౌత్ ఇండియా లో దశాబ్దం నుండి అగ్ర కథానాయికగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత..అలాంటి సమంత ఇప్పుడు అభిమానులతో పాటుగా..ఇండస్ట్రీ లో ఉన్న సెలబ్రిటీస్ ని కూడా భయాందోళనకు గురి చేస్తూ కంటతడి పెట్టించేలా చేసింది..అసలు విషయానికి వస్తే సమంత గత కొంతకాలం నుండి మాయోసిటిస్ అనే వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నట్టు సోషల్ మీడియా లో ఆమె పెట్టిన ఒక పోస్టు ప్రకంపనలు రేపింది.

Samantha- Akkineni Nagarjuna
Samantha- Akkineni Nagarjuna

‘నా జీవితం లో మంచి , చెడు అన్ని ఫాస్ట్ గా జరిగిపోయాయి..అలా నాకు వచ్చిన ఈ మాయోసిటిస్ వ్యాధి కూడా తొందరగా తగ్గిపోతుంది, తగ్గినప్పుడు అభిమానులందరికి తెలియచేద్దాం అనుకున్నాను..కానీ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు..చికిత్స తీసుకుంటున్నాను..త్వరలోనే తగ్గిపోతుంది అనుకుంటున్నాను’ అని ఆమె వేసిన ఒక ట్వీట్ అభిమానులను మరియు సెలెబ్రిటీలను కంగారు పడేలా చేసింది.

‘నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీవి ..జీవితం లో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని నిలబడ్డావు..ఈ వ్యాధిని కూడా విజయవంతంగా ఎదురుకుంటావు..ధైర్యంగా ఉండు’ అంటూ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ,నాగబాబు మరియు సమంత తోటి నటీనటులు ట్విట్టర్ లో ఆమెకి రిప్లై ఇస్తూ ధైర్యం చెప్పారు.

అక్కినేని కుటుంబం నుండి కూడా అఖిల్ మరియు సుశాంత్ వంటివారు సమంత కి ఇంస్టాగ్రామ్ లో రిప్లై ఇస్తూ ధైర్యం చెప్పారు..కానీ సమంత మాజీ మామయ్య అక్కినేని నాగార్జున..మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరుకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..విడిపోయిన కూడా సమంత నాకు ఎప్పటికి కోడలు లాంటిదే అని నాగార్జున గారు అప్పట్లో చెప్పిన మాటలను అందరూ మెచ్చుకున్నారు.

Samantha- Akkineni Nagarjuna
Samantha- Akkineni Nagarjuna

అలాగే సమంత తో విడిపోయినప్పటికీ కూడా ఒక స్నేహితుడిగా ఆమె తోడు జీవితాంతం ఉంటానని నాగ చైతన్య కూడా చెప్పాడు..అలాంటి వీళ్లిద్దరు ఆమె ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడం ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి విమర్శలు రావడం ప్రారంభం అయ్యాయి.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే నాగార్జున – అమల ఇద్దరు కలిసి సమంత చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ కి వెళ్లి ఆమెని కలిసి ధైర్యం చెప్పడానికి వెళ్తున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి..మరి నాగ చైతన్య సమంత ని కలుస్తాడా లేదా అనేది చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version