Pan India Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. టైర్ వన్ హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన బాటలోనే అందరూ నడుస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో పెను సంచనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నాడు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను ఇప్పించాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు సైతం ఇప్పటివరకు పాన్ ఇండియా లో ఒక్క సినిమా చేయకపోయినా రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ వారణాసి ‘ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంటే వారణాసి సినిమా ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది…
‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత చేసిన దేవర సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ‘వార్ 2’ సినిమాతో ఆయన పూర్తిగా డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఆయన డ్రాగన్ సినిమాతో 2000 కోట్ల మార్క్ ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్న విధంగా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా అవతరించిన ఈయన రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాకి అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ సినిమాకి మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు 2027 వ సంవత్సరంలోనే ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరు ఎవరిని డామినేట్ చేసి ముందుకు సాగుతారు అనేది తెలియాల్సి ఉంది…
