https://oktelugu.com/

Mahesh-Trivikram Movie: మహేష్ త్రివిక్రమ్ మూవీలో మరో ఆసక్తికర పాయింట్

Mahesh-Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబోపై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మూవీలు ఇండస్ట్రీలో క్లాసిక్ మూవీలుగా గుర్తింపబడ్డాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కాంబినేషన్ కు సంబంధించిన ఏదో ఒక రూమర్ నిత్యం వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరొక ఆసక్తికర న్యూస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2021 / 08:50 AM IST
    Follow us on

    Mahesh-Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబోపై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మూవీలు ఇండస్ట్రీలో క్లాసిక్ మూవీలుగా గుర్తింపబడ్డాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కాంబినేషన్ కు సంబంధించిన ఏదో ఒక రూమర్ నిత్యం వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరొక ఆసక్తికర న్యూస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

    త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారు. యువ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. నవంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

    ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని త్రివిక్రమ్ మంచి యాక్షన్ తో కూడిన కమర్షియన్ జానర్ లో తీయాలని నిర్ణయించాడట.. రివేంజ్ డ్రామా మూవీగా ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ మూవీని తీయాలని డిసైడ్ అయ్యాడట.. ‘అతడు’ మూవీని మించేలా మరింత అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ను త్రివిక్రమ్ సిద్ధం చేశాడని అంటున్నారు. అలానే ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ తోపాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోయేలా ఉండనున్నారట.. త్రివిక్రమ్ కెరీర్ లెో ఇదే భారీ బడ్జెట్ మూవీ కానుందట..

    ఇప్పటికే పలువురు హాలీవుడ్ టీమ్ ను సిద్ధం చేసిన త్రివిక్రమ్.. ఈసారి మహేష్ బాబుతో సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మహేష్ నటిస్తున్న ‘సర్కారి వారి పాట’ మూవీ పూర్తికాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది.