
పారాలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం వచ్చింది. టేబుల్ టెన్నిస్ లో భవీనాబెన్ పటేల్ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్ లో భారత్ కు ఇదే తొలి పతకం కావడం గమానార్హం.