https://oktelugu.com/

producer comedian: నిర్మాతను నిండా ముంచిన మాజీ జబర్థస్త్ కమెడియన్?

‘రంగుల’ లోకంలో కోట్లు సంపాదించాలని కలలుగనే వారు ఎందరో ఉంటారు. కానీ ఇక్కడ సంపాదించేది చాలా తక్కువ మందే. ఉన్న ఆస్తులు అమ్ముకొని నిండా మునిగిన వారే ఎక్కువమంది. సినీ ఇండస్ట్రీలో ఏదో ఊపేద్దామని చెప్పుడు మాటలు విని వచ్చి లక్షలు మునిగి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. సినిమా విడుదల కాకముందే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా డబ్బులున్న మారాజును ఇలానే సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా పట్టుకొచ్చి నిండా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2021 / 09:14 AM IST
    Follow us on

    ‘రంగుల’ లోకంలో కోట్లు సంపాదించాలని కలలుగనే వారు ఎందరో ఉంటారు. కానీ ఇక్కడ సంపాదించేది చాలా తక్కువ మందే. ఉన్న ఆస్తులు అమ్ముకొని నిండా మునిగిన వారే ఎక్కువమంది. సినీ ఇండస్ట్రీలో ఏదో ఊపేద్దామని చెప్పుడు మాటలు విని వచ్చి లక్షలు మునిగి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. సినిమా విడుదల కాకముందే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు.

    తాజాగా డబ్బులున్న మారాజును ఇలానే సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా పట్టుకొచ్చి నిండా ముంచేశాడట.. ఓ జబర్ధస్త్ కమెడియన్ (Jabardasth Comedian). ప్రస్తుతం  ఇతగాడు జబర్థస్త్ నుంచి బయటకొచ్చి సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ జబర్ధస్త్ ను వాడుకుంటూ ఇలా సినీ అవకాశాలు కొల్లగొడుతున్నాడట.. ఈ వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

    జబర్ధస్త్ తో పాపులర్ అయిన ఓ కమెడియన్ ప్రస్తుతం నటుడిగా అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడు అతగాడి మోజు దర్శకత్వంపై పడిందట.. బయట పిచ్చ క్రేజ్ ఉన్న అతడు తన ఊళ్లోనే ఒక నిర్మాతను పట్టేశాడట.. సొంతూరు నుంచి ఓ డబ్బులున్న బడాబాబును పట్టుకొచ్చి హైదరాబాద్ లో ఆఫీసు తెరిపించాడట.. ఇండస్ట్రీ మరిచిపోతున్న హీరోతో సినిమా కోసం క్లాప్ కూడా కొట్టించాడు.

    ఆ నిర్మాత నుంచి ఏకంగా ఆఫీసు ఖర్చులు.. అడ్వాన్సుల పేరిట తెగ ఖర్చు చేశాడట.. ఇప్పటికే 20 లక్షలు ఖర్చు తేలడం.. ఇంకా సినిమా మొదలు కాకపోవడంతో ఆ నిర్మాత గగ్గోలు పెట్టాడట..‘‘ నీ సినిమా వద్దు.. గినిమా వద్దు నా 20 లక్షలు నాకివ్వు.. ఊరెళ్లిపోతా’’ అని జబర్ధస్త్ నటుడికి తెగేసే చెప్పాడట.. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ వ్యవహారం ఫిలించాంబర్ లో ఆ నిర్మాత ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. దీంతో అలా బయటకు వచ్చింది.

    మంచిగా డబ్బులు పెట్టడానికి వచ్చిన నిర్మాతతో సినిమా తీసి పేరు తీసుకురావాల్సిన జబర్థస్త్ నటుడు అతడి చేత ఇలా ఖర్చు పెట్టించి ఉన్నది ఊడప్ప చేసిన తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.