Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ తన స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈయనకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ అవకపోయినా.. తన రేంజ్ ఏ మాత్రం పడిపోలేదు. ప్రస్తుతం ఈ స్టార్ నటుడు దర్శకుడు రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారట. అంతేకాదు అటు రాజమౌళి సినిమాకు సంబంధించి మహేష్ లుక్ కూడా ఫైనల్ అయిందని.. షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ హైదరాబాద్ శివార్లలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా భూమి మీద ఇన్వెస్ట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
మహేష్ బాబు కొనుగోలు చేసిన ఈ ఆస్తులు విలువ ఏకంగా రూ. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంటుందని టాక్. ఈయనకు ఇప్పటికే థియేటర్లు, రెస్టారెంట్ బిజినెస్ లలో ఇన్వెస్ట్ లు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. హీరోగా మాత్రమే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా మంచి సక్సెస్ ను అందుకున్నారు మహేష్ బాబు.
మహేష్ బాబు రెమ్యూనరేషన్ కూడా టాప్ లో ఉందని టాక్. రూ. 100 కోట్ల రేంజ్ లో ఈయన పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రెండు సంవత్సరాలు ఇతర సినిమాలకు కమిట్ అవకుండా ఉండాల్సిందే. కానీ ఆ తర్వాత హిట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని టాక్.మొత్తం మీద సినిమాలు, బిజినెస్ ల ద్వారా సంపాదిస్తూ.. లాండ్ అయితే కొన్నారు. మరి చూడాలి ఇందులో ఎంత నిజం ఉందనేది..
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Mahesh babu some land in hyderabad do you know how much it costs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com