Mahesh Babu- Namrata Shirodkar: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత పేర్లు కచ్చితంగా ఉంటాయి. వంశీ అనే చిత్రం ద్వారా నమ్రత శిరోద్కర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమాకి ముందే ఆమె బాలీవుడ్ పెద్ద స్టార్ హీరోయిన్, ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో ఈమె మహేష్ కంటే పెద్ద స్టార్. అయితే వంశీ చిత్రం తో మహేష్ బాబు పరిచయం అవ్వడం, ఆ పరిచయం వీళ్ళిద్దరిని బాగా దగ్గర చేసి మంచి స్నేహితులు అవ్వడం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం తో ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యలోనే వీళ్లిద్దరి పెళ్లి 2005 వ సంవత్సరం లో జరగడం , ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ దంపతులు ఇద్దరికీ ఒక సితార మరియు గౌతమ్ అని ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.
సితార మరియు గౌతమ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఇన్నేళ్ల మహేష్ – నమ్రత దాంపత్య జీవితం లో ఒక్కసారి కూడా గొడవలు రాలేదా అని అభిమానులకు అనిపించొచ్చు. కానీ ఎంత మంచి దాంపత్య జీవితం లో అయినా గొడవలు రావడం అనేది సర్వసాధారణం, అలా మహేష్ ఒకసారి కోపం అదుపు తప్పి నమ్రత చెంప పగలగొట్టాడట. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. గౌతమ్ పుట్టబోయే ముందు నమ్రత చాలా కష్టాలను అనుభవించింది అట. ఆమె బరువు చాలా తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నన్సీ లో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయట.
ఇందువల్ల ఆమె తీవ్రమైన డిప్రెషన్ కి లోనై ఊరికే ఏడుస్తూ ఉండేదట. అలా డిప్రెషన్ లో ఉంటే తల్లి కి బిడ్డకి ఇద్దరు ప్రాణాలకు అత్యంత ప్రమాదకరం అని డాక్టర్లు మహేష్ బాబు కి తెలిపారట. దీనితో మహేష్ బాబు నమ్రతకి ఏడవొద్దు అని ఎంత నచ్చచెప్పినా వినేది కాదట.అప్పుడు ఒక రోజు ఆయనకీ బాగా కోపం వచ్చి నమ్రత ని లాగిపెట్టి ఒకటి కొట్టాడట, ఎప్పుడైతే ఆయన అలా కొట్టాడో, అప్పటి నుండి నమ్రత మైండ్ స్టేబుల్ అయ్యిందట, ఇదంతా నమ్రతానే స్వయంగా తెలిపింది.