Mahesh Babu Sentiment: తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళిది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన చేతిలో సినిమా పడిందంటే బ్లాక్ బస్టరే. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అగ్ర దర్శకుడు ఆయనే. ఆయన తీసిన సినిమాలు ఒక్కటి కూడా ప్లాప్ కాలేదంటే ఆయనకున్న టాలెంట్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు వరుసు విజయాలు ఆయన సొంతం. బాహుబలి సినిమాలతో ఆయన ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిసిందే. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా సంచలనాలు సృష్టిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రలుగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం నుంచే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసింది. విడుదలైన తరువాత త్వరలో 50 రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డు దక్కించుకోనుంది. బాహుబలి గ్యాప్ తరువాత ప్రకటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మొదట తెలుగు వరకే పరిమితం చేయాలని భావించినా తరువాత పాన్ ఇండియా మూవీగా చేయాలని ప్లాన్ చేసి బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిన్ లను తీసుకున్నారు.
కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ అద్భుతంగా నటించారు. వీరికి జోడీలుగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా, రాంచరణ్ సరసన అలియా భట్ నటించి మెప్పించారు. దీంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయచరణ్, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్చాండే వంటి వారు నటించి సినిమాకు ప్రాణం పోశారు.

Also Read: Rahul Ramakrishna Kiss: అమ్మాయికి లైవ్ లో లిప్ టు లిప్ ఘాటు కిస్..షాకిచ్చిన రాహుల్ రామకృష్ణ
విడుదలైన నాటి నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కలెక్షన్ల పరంగా సినిమా వాళ్లు ఎప్పుడైనా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ నుప్రామాణికంగా తీసుకుంటారు. దీంతో ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ.5 కోట్ల కలెక్షన్ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దీంతో మరో హీరో మహేశ్ బాబుకు సెంటిమెంట్ గా ఉన్న ఈ థియేటర్ నుంచే సర్కారు వారి పాట రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సినిమా కూడా ఇక్కడ కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తుందని అభిమానుల అంచనా. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా నడుస్తుండటంతో మహేశ్ బాబు సినిమాకు కేవలం రెండు షోలకే అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

Also Read: Hari Teja: ఆ డైరెక్టర్ పై నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ – హరితేజ
Recommended Videos:



[…] Also Read: Mahesh Babu Sentiment: మహేష్ బాబు సెంటిమెంట్.. ఆర్ఆర… […]