https://oktelugu.com/

Venkaiah Naidu: రాష్ట్రపతిగా వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?

Venkaiah Naidu: భారత రాష్ట్రపతి ఎన్నిక వచ్చే జులైలో జరగనుంది. దాని కోసం ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎలాగైనా రాష్ట్రపతి పదవి తమకే దక్కాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మంత్రులను పురమాయించింది. ఎన్టీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీయేతర పార్టీల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు కసరత్తు ప్రారంభించింది. దీని కోసం మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. వారిు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సీఎం ల మద్దతు ఎటు అనే విషయాలపై తెలుసుకోనున్నారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 9, 2022 4:15 pm
    Follow us on

    Venkaiah Naidu: భారత రాష్ట్రపతి ఎన్నిక వచ్చే జులైలో జరగనుంది. దాని కోసం ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎలాగైనా రాష్ట్రపతి పదవి తమకే దక్కాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మంత్రులను పురమాయించింది. ఎన్టీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీయేతర పార్టీల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు కసరత్తు ప్రారంభించింది. దీని కోసం మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. వారిు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సీఎం ల మద్దతు ఎటు అనే విషయాలపై తెలుసుకోనున్నారు.

    Venkaiah Naidu

    Modi

    ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం జగన్ తదితరులతో కేంద్ర మంత్రులు సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్రపక్షాలకు 71,329 ఓట్లతో 5,37,126 ఓట్లు బీజేపీకి ఉన్నాయి. కానీ 9,194 ఓట్లు తక్కువగా ఉండటంతో బీజేపీ ప్రతిపక్షాల సభ్యులను సంప్రదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Rahul Ramakrishna Kiss: అమ్మాయికి లైవ్ లో లిప్ టు లిప్ ఘాటు కిస్..షాకిచ్చిన రాహుల్ రామకృష్ణ

    ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుకే రాష్ట్రపతిగా పదోన్నతి లభించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకుంటే పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నా వెంకయ్యనే చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ సాగుతోంది. ఎన్డీఏ, యూపీఏ కూటములు విడివిడిగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నిక ఏకగ్రీవం కావడం కష్టమే అని సమాచారం.

    Venkaiah Naidu

    Venkaiah Naidu

    రాష్ట్రపతిగా ఇదివరకు ఎస్సీ అభ్యర్థికి అవకాశం ఇచ్చామని ఇప్పుడు ఎస్టీకి ఇవ్వాలనే డిమాండ్ ఉండటంతో ఆ దిశగా ఆలోచిస్తే వెంకయ్యకు చుక్కెదురే. కానీ అధిష్టానం వెంకయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో కూడా మన తెలుగువారైన నీలంసంజీవరెడ్డి రాష్ట్రపతిగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వెంకయ్య నాయుడు రాష్ర్టపతి అయితే దక్షిణాది నుంచి అదీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన వ్యక్తిగా మరో రికార్డు సొంతం చేసుకుంటారు.

    బీజేపీకి పలు సందర్భాల్లో వైసీపీ మద్దతు ఇస్తూనే ఉంది. పలు విషయాల్లో బీజేపీకి అవసరమైన సమయాల్లో కీలకంగా వ్యవహరించి కష్టాలనుంచి బయట పడేస్తోంది. కానీ ఈ సారి కొన్ని షరతులు విధించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం, విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి పలు డిమాండ్లు తెరమీదకు తేనుందని సమాచారం. దీంతో బీజేపీ వైసీపీ కోరిన కోరికలు తీర్చడానికి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

    Venkaiah Naidu

    Modi, Y S Jagan

    ప్రతిపక్షాల నుంచి ఎన్సీపీ నేత శరత్ పవార్, దేవెగౌడ పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్, శివసేన, అకాలీదళ్ లాంటి పార్టీలు మద్దతు ఇచ్చినా ప్రస్తుతం అవి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేరు కూడా బయటకు వస్తోంది. ఆయన కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీకి రాష్రపతి ఎన్నిక కష్టతరంగానే మారే అవకావాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎలాగైనా గగ్టెక్కాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా వెంకయ్య నాయుడుకు అదృష్టం కలిసొస్తుందా? లేక బెడిసికొడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

    Also Read: Kishore Tirumala: ప్చ్.. ఒక్క ప్లాప్ కే ఆ డైరెక్టర్ కి ఫైనాన్సియల్ సమస్యలు

    Recommended Videos:

    Pawan Kalyan Key Comments on Political Alliance || Janasena TDP Alliance || AP Politics

    TDP Leader Ayyanna Patrudu Satirical Comments on CM Jagan || AP Panchayathi Funds || Ok Telugu

    పవన్ పవర్ పంచ్ లు.. || Pawan Kalyan Powerful Words || Janasena vs YCP || Ok Telugu

    Tags