Homeఎంటర్టైన్మెంట్Tollywood : అలాంటి హీరోలు రాకపోవడం లేకపోవడం విచిత్రమే !

Tollywood : అలాంటి హీరోలు రాకపోవడం లేకపోవడం విచిత్రమే !

Tollywood: It Is Strange That Such Heroes Do Not Come

Tollywood: తెలుగు సినిమాల్లో (Tollywood) ఇప్పుడు కామెడీ హీరోలు కరువైపోయారు. రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగు సినిమాల్లో ఆ స్థాయిలో కామెడీ హీరోలు ఎవరు రాలేదు. అల్లరి నరేష్ కొంతవరకు కామెడీ హీరో రోల్ కి న్యాయం చేసినా.. ఇప్పుడు నరేష్ ఆ స్థానం నుంచి తప్పుకున్నాడు. మధ్యలో కొందరు హీరోలు మెరిసినా.. రాజేంద్రప్రసాద్ లా ఎవరు కామెడీ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు.

1980, 1990 కాలంలో తెలుగులో చాలా హాస్య చిత్రాలు వచ్చేవి. పైగా అప్పట్లో తెలుగులో గొప్ప హాస్యనటులు ఉండేవారు. అందుకే ఎన్నో హాస్య చిత్రాలు చేసారు మన మేకర్స్. కానీ కాలం మారింది, స్టార్ హీరోలే కామెడీ చేయడం అలవాటు చేసుకున్నారు. కానీ నిజమైన హాస్యాన్ని మాత్రం ఏ స్టార్ హీరో అందించట్లేదు.

దీనికి తోడు జంధ్యాల, ఈవీవీ లాంటి హాస్య బ్రాహ్మలు కూడా లేరు. వారి స్థానంలోకి ఇంతవరకు ఎవరు రాలేదు. దాంతో తెలుగు చిత్రసీమలో నెమ్మదిగా హాస్య సినిమాలు తగ్గిపోయాయి. లవ్ స్టొరీ , యాక్షన్ సినిమాలు పెరుగిపోయాయి. తెలుగు సినిమాలో గత ఇరవై ఏళ్లలో చాలా మటుకు హాస్య సినిమాలు చేసిన ఒకే ఒక్క నటుడు అల్లరి నరేష్.

కానీ ఆ సినిమాలు హాస్యంలో దిగువస్థాయివి. పైగా వాటిల్లో ఫ్లాప్ సినిమాలే ఎక్కువ. అందుకే తెలుగులో హాస్య సినిమాలు రావడం లేదు. మనకు ఉన్న హీరోలు కూడా రెండు రకాల హీరోలు. ఒకరు, లవ్ స్టొరీ చేసే సినిమా హీరోలు, ఇంకొకరు యాక్షన్ హీరోలు. అదేంటో ఈ జోనర్స్ లో తప్ప స్వచ్చమైన హాస్య చిత్రాన్ని అందించాలనే హీరో రాకపోవడం లేకపోవడం విచిత్రమే.

ఇప్పటికైనా అత్యుత్తమ హాస్య చిత్రాలు చేయాలనుకునే హీరోలు ఎదిగితే.. తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ ‘అహ నా పెళ్ళంట, చిత్రం భళారే విచిత్రం’ వంటి పూర్తి హాస్య చిత్రాలు చూసే బాగ్యం కలుగుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version