Rishabh Pant: రిషభ్ పంత్ పై ఐసీసీ సీరియస్ అయ్యింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందుకు ఐసీసీ రిషభ్ పంత్ ను మందలించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి టెస్టు మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో బాల్ కండిషన్ సరిగాలేదని మార్చాలని పంత్ కోరాడు. బంతిపి చెక్ చేసిన అంఫైర్ రైఫీల్ బాల్ మార్చేందుకు నిరాకరించాడు. అంఫైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పంత్ బంతిని నేలకేసి కొట్టాడు. తాజాగా తన తప్పును అంగీకరించాడు.