Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు (Mahesh Babu)…ఆయన తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి తో చేస్తున్న సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక మహేష్ బాబు తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంటల్ సినిమాలను చేస్తూ వచ్చాడు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేసిన వన్ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నప్పటికి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు భారీ స్టంట్స్ చేశాడు.
డూప్ లేకుండా కొన్ని సన్నివేశాల్లో పాల్గొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫారన్ లో వచ్చే చేజింగ్ ఎపిసోడ్స్ లో బిల్డింగ్స్ మీద నుంచి దూకే సీన్స్ లో తను ఎలాంటి డూప్ లేకుండా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
Also Read : మహేష్ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు దర్శకులు..తదుపరి చిత్రం ఎవరితో అంటే!
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు (Mahesh Babu) లాంటి నటుడు ఇక మీదట రాబోయే సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆయన అన్ని కుదిరితే హాలీవుడ్ దర్శకులతో కూడా సినిమాలను చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే కొంతమంది హాలీవుడ్ దర్శకులు మహేష్ బాబు కి కథలను కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా ఈ సినిమా రిజల్ట్ ను బట్టి ఆయన స్టార్ డమ్ అనేది విస్తరిస్తుందా? లేదంటే డౌన్ అయిపోతుందా? అనేది తెలియబోతుంది…ఇక ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ రాజమౌళి(Rajamouli) తో చేస్తున్న సినిమా మీదనే పెట్టాడు. తొందర్లోనే ఈ సినిమా కి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ను చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు మీద భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…