Mahesh Babu : కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు, అభిమానులు మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే షూటింగ్స్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, మొదటి షెడ్యూల్ ని ఒడిశా లో పూర్తి చేసుకుంది. ఈ షూటింగ్ కి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇక రెండవ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో, చిన్న బ్రేక్ దొరికింది. రెండవ షెడ్యూల్ మొదలు అవ్వడానికి చాలా సమయం ఉండడంతో మహేష్ బాబు తన కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు. అదే విధంగా రాజమౌళి కూడా #RRR మూవీ డాక్యుమెంటరీ వెర్షన్ జపాన్ లో విడుదల అయిన సందర్భంగా ఆ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్నాడు.
Also Read : మహేష్ బాబు మిస్ చేసుకున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్…
ఇలా ఇద్దరు చెరో దేశానికి వెళ్లడం తో రెండవ షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదని అభిమానులు అనుకున్నారు. కానీ మహేష్ నేడు కాసేపటి క్రితమే హైదరాబాద్ కి తిరిగి వచేసాడు. రెడ్ కలర్ జాకెట్, లోపల బ్లూ టీ షర్ట్, బ్రౌన్ ప్యాంట్ లో మహేష్ బాబు విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు కాబట్టి , ఇక రెండవ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరికొద్ది రోజుల్లోనే మహేష్ బాబు, రాజమౌళి, పృథ్వీ రాజ్, ప్రియాంక చోప్రా కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారట. ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇవ్వబోతున్నారట. అదే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ ని కూడా చెప్పేయబోతున్నట్టు తెలుస్తుంది. రెండవ షెడ్యూల్ నుండి గ్యాప్స్ లేకుండా నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ నడుస్తూనే ఉంటాయట.
అందుకే మహేష్ బాబు ని కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లేందుకు రాజమౌళి అనుమతిని ఇచ్చాడట. కావాల్సినన్ని రోజులు రిలాక్స్ అయిన మహేష్, ఇక నుండి క్షణం తీరిక కూడా లేకుండా ఫుల్ బిజీ కానున్నాడు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్స్ కానీ, ఫ్రీక్వెల్స్ కానీ ఉండవట. కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఈ కాంబినేషన్ ముగుస్తుందని తెలుస్తుంది. దీనిపై కూడా ప్రెస్ మీట్ లో క్లారిటీ రానుంది. అదే విధంగా ఈ చిత్రం పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు అనేది ఖరారు అయ్యింది. కానీ ప్రియాంక చోప్రా హీరోయినా?, లేకపోతే ఆమె కూడా విలనా? అనే దానిపై కూడా స్పష్టత లేదు, ప్రెస్ మీట్ లో దానికి కూడా సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. 2027 వ సంవత్సరం లో ఎట్టిపరిస్థితిలోనూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Also Read : మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరిలో కనిపించే కామన్ ఎలిమెంట్ ఏంటంటే..?
Globetrotting cutout superstar #maheshbabu back to hyd Papped at airport @urstrulyMahesh #SSMB29 pic.twitter.com/8t7kB5NDlo
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) April 15, 2025