Pawan Kalyan Wife Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా.. గత రెండు రోజుల నుంచి ఈవిడ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రమాదంలో చిక్కుకోవడం.. చికిత్స పొంది హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన మరుసటి రోజు పవన్ భార్య తిరుమల యాత్ర చేసి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీన్ని బట్టి తల్లిగా ఆమె పడిన బాధ ఏంటన్నది అర్థమవుతోంది.
ఆ సమయంలో అన్నా ఏం ప్రార్థించిందో తెలియదు.. తిరుమలేషుడిని ఏం మొక్కుకుందో తెలియదు. ఆమె కొడుకు కోసం అంత ఆవేదన చెందిందో అర్థమవుతోంది.
తిరుమలలో జరిగినది తెలుగు నేలనే కాదు.. దేశమంతా చర్చించుకుంది. ఆమె ఏదీ దాచుకోకుండా నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం.. రెండోది ఆచారాలు అన్నీ పాటిస్తూ తలనీలాలు సమర్పించడం.. తను స్వయంగా విరాళం అందజేసి అన్నదానం స్వయంగా చేసింది.
అన్నింటికంటే పెద్దదైనది డిక్లరేషన్. క్రిస్టియన్ కాబట్టి తిరుమల దేవుడిని విశ్వసిస్తూ డిక్లరేషన్ ఇచ్చారు అన్నా. గత అంతకుముందు పరిపాలన చేసిన జగన్ హయాంలో ముఖ్యమంత్రినే దాన్ని ఉల్లంఘించాడు. సీఎం అయినా తిరుమలకు వచ్చినప్పుడు ఆయన భక్తుడే. తిరుమల ఆచారాలు పాటించాలి. కానీ జగన్ అది పాటించలేదు.
ఎంతోమందిని ఆలోచింపజేసిన అన్నా లెజినోవా తిరుమల యాత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
