Mahesh Babu and Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ సైతం వరుస సినిమాను చేస్తూ ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు (Alluri Seetharamaraju) క్యారెక్టర్ కి చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులను ఏర్పాటు కునేలా ఆ పాత్ర తనకు చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఆయనకి గొప్ప గుర్తింపును తెచ్చిపెడుతున్న సినిమాలే కావడం విశేషం… అందువల్లే ఆయన కంటూ ఒక స్టైల్ ను ఏర్పాటు చేసుకొని ఆ స్టైల్ లోనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి(Rajamouli)తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.
Also Read : మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరిలో కనిపించే కామన్ ఎలిమెంట్ ఏంటంటే..?
మరి ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పరిధిని దాటి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరిస్తాను అనే ఒక నమ్మకాన్ని అయితే పెట్టుకున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఒకప్పుడు మహేష్ బాబు చేయాల్సిన సూపర్ హిట్ సినిమాని రామ్ చరణ్ చేసి మంచి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఆ సినిమా చాలా వరకు ఉపయోగపడిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ మహేష్ బాబు వదిలేసుకున్న సినిమా ఏంటి అంటే ‘వంశీ పైడిపల్లి’ (Vamshi Paidipally) డైరెక్షన్ లో వచ్చిన ఎవడు(Evadu) సినిమా… అయితే ఎవడు మూవీ కథను మొదట మహేష్ బాబుకి వినిపించారట. అప్పుడు తను ఉన్న బిజీగా ఉండటం వల్ల సినిమా చేయలేకపోయాడు.
దాంతో రామ్ చరణ్ ఆ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఒకప్పుడు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక మహేష్ బాబుకు దక్కాల్సిన విజయాన్ని సైతం తన ఖాతాలో వేసుకొని ముందుకు సాగాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!