Sunrisers Hyderabad captain Cummins
Pat Cummins:కమిన్స్ ప్రస్తుతం శ్రీలంక టోర్నిలో ఆడటం లేదు.. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది కూడా అనుమానమే. ఇప్పటికే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కోచ్ మెక్ డొనాల్డ్ స్పష్టం చేశాడు.. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆస్ట్రేలియాకు హెడ్ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించాడు.. అయితే శ్రీలంక టోర్నీలో కమిన్స్ ఆడక పోవడం వెనుక ఒక కారణం ఉంది. ఎందుకంటే కమిన్స్ రెండవసారి తండ్రి అయ్యాడు. ఇటీవల అతని భార్య బెకీ గర్భం దాల్చింది.. శనివారం ప్రసాదించింది. పండంటి కూతురికి జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని కమిన్స్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు.. తన కూతురు ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు.. అయితే ఆ చిన్నారికి ” ఇది” అని కమిన్స్ పేరు పెట్టాడు.. తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ” ఇది మాకు ముద్దుల కూతురు. ఆమె ఇక్కడ ఉంది. ఈ అద్భుతమైన ఆనందాన్ని వర్ణించడానికి నాకు నోటి వెంట మాటలు రావడంలేదని” కమిన్స్ పేర్కొన్నాడు. భారత కాలమానం ప్రకారం కమిన్స్, బెకి దంపతులకు శుక్రవారం రాత్రి 10 గంటలకు “ఇది” జన్మించింది.. కమిన్స్ – బెకి దంపతులకు ఇదివరకే ఆల్బి పేరుతో ఒక కుమారుడు ఉన్నారు..
కమిన్స్ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి గురయ్యాడు. గతంలో అతడికి గాయం అయినప్పటికీ.. చికిత్స పొందడంతో తగ్గింది. అయితే టీమ్ ఇండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న నేపథ్యంలో అతడికి గాయం మళ్ళీ తిరగబెట్టింది.. దీంతో అతడు శ్రీలంక టోర్నీకి దూరంగా ఉన్నాడు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీ లో కూడా ఆడేది అనుమానమే నట. అందువల్లే అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు స్మిత నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా గట్టు శ్రీలంక పై విజయం సాధించింది.. కమిన్స్ తో పాటు హేజిల్ వుడ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.. మార్కస్ స్టోయినిస్ అయితే ఏకంగా వన్ డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.. ఆటగాళ్లకు గాయాలతో.. రిటైర్మెంట్ నిర్ణయాలతో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. అయితే ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కమిన్స్ బ్యాటింగ్, బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. టీమిండియా పతనాన్ని శాసించాడు. దీంతో ఆస్ట్రేలియా 3-1 తేడాతో టీమిండియా పై విజయం సాధించింది. అంతేకాదు త్వరలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా తో టైటిల్ పోరులో తలపడనుంది. కమిన్స్ కు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో సోషల్ మీడియాలో అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువ సాగుతోంది. ” కమిన్స్ కు కంగ్రాట్యులేషన్స్. అందమైన ఆడబిడ్డ జన్మించింది. అచ్చం ఆమె నీ లాగే ఉంది. నీలాగే ఆమె ఉన్నత స్థితిలో ఉండాలి. మెరుగైన ప్రయాణాన్ని జీవితకాలం కొనసాగించాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.