Mahesh Rajamouli: ప్రస్తుతం దేశంలోనే పవర్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలితో ఈ తెలుగు డైరెక్టర్ ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. దెబ్బకు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు రాజమౌళితో సినిమాలకు అమీర్ ఖాన్ నుంచి రజినీకాంత్ వరకూ.. చిరంజీవి నుంచి టాలీవుడ్ హీరోలందరూ చేయాలని ఉబలాటపడుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం కథను బట్టే సినిమా తీస్తాడు. హీరోలను బట్టి తీయడు.

ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ అంటూ అల్లూరి, కొమురంభీం కథను తీస్తున్నాడు. అందులో ఇద్దరు తెలుగు స్టార్ హీరోలను పెట్టి ప్యాన్ ఇండియా మూవీ చేశాడు. బాహుబలితో ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసిన రాజమౌళి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు రాంచరణ్, ఎన్టీఆర్ లను కూడా ఆ రేంజ్ కు తీసుకెళుతున్నారు.
ఇక వీరందరితోపాటు రాజమౌళి నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే.. ఇప్పటికే మహేష్ ఒడ్డూ పొడువుకు ప్యాన్ ఇండియా స్టార్ కావాల్సింది. కానీ ఇప్పుడు వివిధ ప్రకటనలతో హిందీ వారికి చేరువయ్యాడు. చూపుకు హాలీవుడ్ హీరోలా ఉన్నా ఇప్పటికీ మహేష్ తెలుగు తెరకే పరిచయం అయ్యాడు.
ఇప్పుడు రాజమౌళితో మహేష్ తీయబోయే ఆఫ్రికన్ అడ్వంచర్ మూవీతో ప్యాన్ ఇండియానే కాదు.. హాలీవుడ్ హీరో కూడా అయిపోవచ్చు. అందుకే రాజమౌళి సినిమా విషయంలో మహేష్ ఆసక్తిగా ఉన్నాడట.. ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని డిసైడ్ అయ్యాడట.. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రేసులోకి రాగానే మొదట సంక్రాంతి రేసులో ఉన్న తన ‘సర్కారివారి పాట’ సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేసేందుకు మహేష్ అంగీకరించాడట.. మిగతా హీరోలు తటపటాయించారు. ప్రభాస్ రాధేశ్యామ్ ను అలాగే ఉంచాడు. పవన్ భీమ్లా నాయక్ ను కూడా మార్చలేదు. కానీ రాబోయే సినిమా రాజమౌళితోనే కావడంతో మహేష్ బాబు ఇప్పుడు దర్శకధీరుడితో వైరం ఎందుకని.. ఆయన సినిమా కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నాడట..
రాజమౌళితో పెట్టుకొని అనవసరంగా దూరం అయ్యే బదులు.. ఆయనను మెప్పించేలా తన సినిమాను వాయిదా వేసి మహేష్ బాబు ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.