Mahesh – Trivikram: మహేష్ ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించాలని దర్శకుడు త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు. మహేష్ తో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ట్రై చేస్తున్న ఆయన హీరో మేకోవర్ పై దృష్టి పెట్టాడు. కొద్దిరోజులుగా మహేష్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠిన కసరత్తులు చేస్తున్నారు. మహేష్ కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ట్రై చేస్తున్నారనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. SSMB 28 నిర్మాతలుగా ఉన్న హారిక హాసిని క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో మహేష్ కసరత్తులు చేస్తున్న వీడియో విడుదల చేశారు.
Mahesh – Trivikram
ఆ వీడియోలో ట్రెడ్ మిల్ పై రేసు గుర్రంలా మహేష్ పరుగెడుతున్నారు. ”SSMB 28 కోసం సూపర్ స్టార్ కష్టపడుతున్నారు. ఆయనలో ఎక్కడలేని ఎనర్జీ ఉంది. అది మీరు రేపు స్క్రీన్ పై చూస్తారు” అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.రోల్ కోసం జిమ్ లో ఇంతలా కష్టపడుతున్న మహేష్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఎన్టీఆర్ కూడా ఇదే రేంజ్ లో కష్టపడ్డారు. ప్రస్తుతం మహేష్ కి శిక్షణ ఇస్తున్న లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ కోసం పని చేశారు. రాజమౌళి మాదిరి మహేష్ కి దర్శకుడు త్రివిక్రమ్ భారీ టాస్క్ ఇచ్చారనిపిస్తుంది.
Also Read: Avoid Health Problems: అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?
ఇక దర్శకుల సూచనలకు తూచా తప్పక పాటించే మహేష్ బాబు… యాభై ఏళ్ల వయసులో కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం మహేష్ గడ్డం, మీసం పెంచుతున్నారు. గతంలో మహేష్ ఎన్నడూ సిల్వర్ స్క్రీన్ పై నిండైన గడ్డంతో కనిపించలేదు. కాగా ఫ్యామిలీ చిత్రాల ఎక్స్పర్ట్ గా పేరున్న త్రివిక్రమ్ మహేష్ తో మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇది రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదని హింట్ ఇచ్చారు.
Mahesh – Trivikram
SSMB 28 మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. గతంలో అతడు, ఖలేజా చిత్రాలకు ఇద్దరూ కలిసి పనిచేశారు. అతడు మహేష్ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఖలేజా మాత్రం నెగిటివ్ టాక్ అందుకుంది. అయితే ఖలేజా మూవీలో మహేష్ రోల్ త్రివిక్రమ్ డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్ కి నచ్చింది. మహేష్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. ఆ సినిమా విడుదలై దశాబ్దం దాటిపోతుండగా ఎన్నాళ్లకు కాంబినేషన్ సెట్ అయ్యింది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also Read:Brahmastra First Review: బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ : సినిమా హిట్టా ? ఫట్టా ?
Our Reigning Superstar sweating out hard for #SSMB28 ⚡
He’s got unimaginable energy within him. Which is going to be seen on screens on next summer 💥💥@urstrulyMahesh @lloydstevenspt#intensitymatters pic.twitter.com/PgqHlSFR6m
— Haarika & Hassine Creations (@haarikahassinee) September 6, 2022