https://oktelugu.com/

Superstar Krishna: మహేష్ కాకుండా కృష్ణ గారికి నేటి తరం స్టార్ హీరోలలో ఫేవరెట్ ఎవరో తెలుసా?

Superstar Krishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎన్నో సంచలనాత్మక సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ లో సరికొత్త టెక్నాలిజీలను తీసుకొచ్చిన మహానటుడు కృష్ణ గారు..అప్పట్లో ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఫాలోయింగ్ పరంగా మరియు బాక్స్ ఆఫీస్ పరంగా నువ్వా నేనా అనే రేంజ్ లో బలమైన పోటీ ని ఇచ్చాడు కృష్ణ..రాజకీయాల్లో కూడా ఆయనకీ కృష్ణ గారికి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 8, 2022 / 12:31 PM IST
    Follow us on

    Superstar Krishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎన్నో సంచలనాత్మక సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ లో సరికొత్త టెక్నాలిజీలను తీసుకొచ్చిన మహానటుడు కృష్ణ గారు..అప్పట్లో ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఫాలోయింగ్ పరంగా మరియు బాక్స్ ఆఫీస్ పరంగా నువ్వా నేనా అనే రేంజ్ లో బలమైన పోటీ ని ఇచ్చాడు కృష్ణ..రాజకీయాల్లో కూడా ఆయనకీ కృష్ణ గారికి పోటీని ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి..ఇక ఆయన నట వారసుడిగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన అందరికి తెలిసిందే..ఎన్నో వైవిధ్యమైన పాత్రలు మరియు సినిమాలతో యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు..కృష్ణ గారికి మహేష్ ని చూసినప్పుడల్లా నా కొడుకు నెంబర్ 1 హీరో అనే గర్వం కనిపిస్తూ ఉంటుంది..ఎప్పుడు మహేష్ గురించి ఆయన మాట్లాడిన ఆయన కళ్ళలోని ఆనందాన్ని మనం గమనించొచ్చు.

    Superstar Krishna, MAHESH

    ఇది ఇలా ఉండగా ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారిని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ తీసుకుంది..ఈ ఇంటర్వ్యూ లో మహేష్ బాబు కాకుండా నేటి తరం స్టార్ హీరోలలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని అడిగిన ప్రశ్న కి కృష్ణ గారు సమాధానం చెప్తూ ‘మా తరం లో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు మాత్రమే ఉండేవారు..కానీ నేటి తరం లో భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది..ప్రతి ఒక్కరు అద్భుతంగా నటిస్తున్నారు..వారిలో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం..కానీ నాకు మహేష్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే బాగా ఇష్టం..ఆయన సినిమాలు బాగా చూస్తుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణ..కృష్ణ గారు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

    Also Read: Bigg Boss Telugu 6: అమ్మ బాబోయ్… ఆ లేడీ కంటెస్టెంట్స్ ని చూసి జడుసుకుంటున్న ప్రేక్షకులు… ప్లీజ్ మేకప్ వేయండయ్యా!

    Superstar Krishna

    గతం లో కూడా పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అంటూ చెప్పుకొచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే #RRR సినిమా చూశానని..ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా అత్యద్భుతంగా నటించారని ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ చెప్పుకొచ్చారు.

    Also Read:Brahmastra First Review UAE: బ్రహ్మస్త్ర యూఎస్ ప్రీమియర్ రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?

    Tags