Mahesh Babu-Rajamouli Movie Update: మహేష్ బాబు తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో ఒక సినిమా కూడా చేయకపోవడం విశేషం… తన తోటి హీరోలంతా పాన్ ఇండియా హీరోలుగా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయినప్పటికి ఇప్పుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి ట్రాక్ రికార్డు గురించి మనందరికి తెలిసిందే. ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే ఆ 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోం… ఇక రాజమౌళి ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా తాలూకు ఎమోషన్ అనేది పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమాను కూడా ఒక భారీ ఎమోషనల్ డ్రామాగా కూడా తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే రాజమౌళికి గొప్ప పేరైతే వస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి (Rajamouli) జూలై నెల నుంచి కెన్యాలోని అడవుల్లో కీలకమైన ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికోసం కెన్యాలోనే ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ చేతుల మీదుగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారట…
మహేష్ బాబు కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. మరి కెన్యాలోని అడవులను ఇప్పటికే పరిశీలించి వచ్చిన రాజమౌళి మొత్తానికైతే అందులో ఒక భారీ అడ్వెంచర్ సీక్వెన్స్ ను కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Rajamouli – Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమా అన్ని దేశాల్లో షూటింగ్ జరుపుకోబోతుందా..?
అయితే ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృధ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్లతో పాటు గా ఈ సినిమాలో భాగమయ్యారు అనే విషయం మీద రాజమౌళి అయితే ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.
మిగతా ఆర్టిస్టులు ఎవరు అనేదానిమీద ఇంత రహస్యంగా ఉంటున్న రాజమౌళి ఇందులో ఎవరెవరు నటిస్తున్నారని విషయాన్ని ఎప్పుడూ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు అనేది తెలుసుకోవడానికి తమ అభిమానులు సైతం ఆసక్తి ఎదురు చూస్తున్నారు.