Rajamouli – Mahesh Babu : దర్శక ధీరుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…ఈయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు అంటే దానికి కారణం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయనకి ఏం కావాలో అది ఆర్టిస్టుల దగ్గర నుంచి రాబట్టుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందువల్లే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో ఆదరణ కూడా ఎక్కువగా దక్కుతుందనే చెప్పాలి. మహేష్ బాబు (Mahesh Babu) చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసిన రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే రాజమౌళి సినిమా అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపైతే ఉంది.
ఇక పాన్ వరల్డ్ లో ఆయన సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనే విషయం మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఈ సినిమాని దాదాపు 25 దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఇద్దరిలో ఎవరి ఓడినా గుండె ఆగిపోతుంది అంటూ డైరెక్టర్ రాజమౌళి సంచలన పోస్ట్!
ఇప్పటివరకు ఏ సినిమాను జరపలేనన్ని దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరపడం అలాగే ఈ సినిమాతో తనను తాను పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి ఈ సినిమా ద్వారా రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబుని చాలా వైల్డ్ రేంజ్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మహేష్ బాబు (Mahesh Babu) సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ చాలా వరకు డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలను తనే చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమా కనక పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మహేష్ బాబు హాలీవుడ్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…