Mahesh Babu Rajamouli Movie : మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి అటు అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో, ఇటు మూవీ లవర్స్ లో కూడా అంతే అంచనాలు ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ సెట్ అయ్యి పదేళ్లు అయ్యింది, అది కార్య రూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సినిమా మొదలైంది అనే విషయాన్నీ రాజమౌళి & టీం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. రెండు షెడ్యూల్స్, దాదాపుగా 20 రోజులకు పైగా షూటింగ్ చేసారు. కానీ ఒక్క అప్డేట్ కూడా ఈ చిత్రం నుండి రాలేదు. సినిమా మొదలైన కొద్దిరోజులకే రాజమౌళి తన సినిమా కథ, థీమ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుంటాడు. కానీ ఈ సినిమాకు మాత్రం అలా ఇప్పటి వరకు చేయలేదు.
Also Read : ఒకప్పుడు బార్బర్ గా పనిచేసిన ఈ పాన్ ఇండియా స్టార్ నటుడు ఎవరో తెలుసా…
కానీ ఈ ఏడాది మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9 న ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేద్దామని రాజమౌళి మహేష్ బాబు తో అన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది. మహేష్ ఫ్యాన్స్ కి ఎలా అయితే ఈ సినిమా గురించి అప్డేట్స్ తెలుసుకోవాలని ఆత్రుత ఉందో, మహేష్ బాబు కి కూడా తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సినిమా గురించి అప్డేట్ తెలియజేయాలని అంతే ఆత్రుత ఉంది. కానీ ఆగష్టు 9న ఏర్పాటు చేయాలనీ అనుకున్న ఈ ప్రెస్ మీట్ ని వాయిదా వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ వినిపిస్తున్న హాట్ టాపిక్. కచ్చితంగా ప్రెస్ మీట్ ఆగష్టు 9 న ఉంటుందని మహేష్ కి చెప్పిన రాజమౌళి, ఇప్పుడు మాట మార్చేయడం తో మహేష్ అలిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ షెడ్యూల్ తర్వాత దాదాపుగా 40 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఎక్కువ శాతం ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ కి సంబంధించిన సెట్ వర్క్స్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్స్ లో మహేష్ పై ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక మూవీ టీం మొత్తం ఆఫ్రికా కి పయనం కానుంది. అక్కడ రెండు నుండి మూడు నెలల పాటు ప్లాన్ చేసిన నాలుగు షెడ్యూల్స్ ని చిత్రీకరించబోతున్నారట. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2027 వ సంవత్సరం లో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రాజమౌళి. ఈ చిత్రం లో ఇప్పటికే పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ లోకి తమిళ హీరో విక్రమ్ కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.