Pan India Star: అనుకున్న సినిమా బాగా రావడానికి అతను తన శరీరాన్ని ఎంతైనా కష్టపడేలా చేస్తాడు. అందుకే ఈ స్టార్ నటుడుకి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న స్టార్ హీరో హీరోయిన్లు చాలామంది బాల్యంలో లేదా టీనేజ్ లో ఎన్నో కష్టాలు పడిన వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పొట్ట కూటి కోసం కూలి పనులు చేసిన నటీనటులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ నటుడు కూడా ఈ కోవాకు చెందిన వాడే. ఈ స్టార్ హీరో తన టీనేజ్లో చాలా కష్టాలు పడ్డాడు. జాబ్ స్కిల్స్ లేకపోవడంతో ఇతను చాలా సమస్యలను ఎదుర్కొన్నాడట. అప్పుడు ఏం చేయాలో తోచక ఎక్కువ సమయాన్ని నవ్వులలు చదవటానికి అలాగే సినిమాలు చూడడానికి కేటాయించే వాడట.
Also Read: చాలా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా
అప్పుడు వాళ్ళ అమ్మ చాలా బాధపడడంతో ఒక సెలూన్ షాప్ లో ఈ హీరో బార్బర్ గా పనికి చేరాడట. ఇదే ఇతని జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇతనిలో ఉన్న టాలెంట్ ను గుర్తించిన బార్బర్ షాప్ ఓనర్ అతనిని ఒకసారి డైరెక్టర్ కె బాలచందర్ ను కలవమని చెప్పాడట. ఆ షాపు ఓనర్ మాట వినడంతో అతని జీవితం మలుపు తిరిగింది. ప్రస్తుతం ఇతను పాన్ ఇండియా స్టార్ యాక్టర్. మన దేశం గర్వించదగ్గ దిగ్గజ నటులలో ఇతను కూడా ఒకరు. ఈ హీరో మరెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇతను నటించిన లేటెస్ట్ సినిమా తగ్ లైఫ్. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ అని కూడా సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్గా హీరో కమల్ హాసన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తన వ్యక్తిగత జీవితంతో పాటు తన సినిమా జీవితం గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన కమల్ హాసన్ ఒకప్పుడు తాను బార్బర్గా పనిచేసినట్లు అందరితో పంచుకున్నారు. కానీ అది ఇంట్రెస్ట్ తో మాత్రం చేయలేదట కేవలం వాళ్ళ అమ్మను ఇబ్బంది పెట్టాలని, కోపం తెప్పించాలని మొండి పట్టుదలతో చేసినట్లు కమల్ హాసన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
He gave White a whole new Attitude!
In his fashion house #khhouseofkhaddar #Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR
A #ManiRatnam Film
An @arrahman Musical@ikamalhaasan @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan… pic.twitter.com/HgZaLl8hrc— Raaj Kamal Films International (@RKFI) May 8, 2025