Mahesh Babu-Rajamouli Movie First Song: మహేష్(Superstar Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli) మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఒక సినిమాకు ఇంతటి క్రేజ్ ని చూడడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు సైతం అంటున్నారు. సాధారణంగానే మహేష్ సినిమాలు మంచి క్రేజ్ తో విడుదల అవుతుంటాయి, అలాంటిది రాజమౌళి లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆ మాత్రం ఉండడం లో వింతేమీ ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నవంబర్ లో ఒక భారీ ఈవెంట్ ని ఎప్రాటు చేసి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్,గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు. ఇదే ఈవెంట్ లో ఈ సినిమాలో నటించబోతున్న నటీనటుల వివరాలు, మూవీ స్టోరీ ని కూడా రివీల్ చేయనున్నాడు రాజమౌళి. ఈ ఈవెంట్ కి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక పోతే రాజమౌళి ప్రతీ సినిమాలో పాటలు పాడే కీరవాణి కొడుకు కాలభైరవ మహేష్,రాజమౌళి మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే సుమ కొడుకు హీరో గా నటిస్తున్న ‘మౌగ్లీ’ మూవీ కి సంబంధించిన ప్రెస్ మీట్ ని కాసేపటి క్రితమే ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కాళ భైరవ కూడా ఈవెంట్ కి విచ్చేశాడు. ఆయన్ని విలేఖరి ఒక ప్రశ్న అడుగుతూ ‘#RRR మూవీ లోని నాటు నాటు పాటలో మీరు కూడా ఒక భాగం అయ్యారు. అది ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టింది. అదే విధంగా కొమరం భీముడో పాటకు కూడా అద్భుతమైన గాత్రం అందించారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో మీ భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు’ అని అడుగుతాడు.
దానికి కాళ భైరవ సమాధానం చెప్తూ ‘మహేష్ బాబు గారి సినిమా మాత్రమే కాదు, నాన్నగారి ప్రతీ సినిమాలోనూ నా అవసరం ఉంటే కచ్చితంగా నాకు పని అప్పగిస్తూ ఉంటారు. మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి ఒక స్వీట్ సప్రైజ్ ఉండబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయ్యింది. చూస్తుంటే నవంబర్ నెల నుండి, ఈ కాంబినేషన్ కి సంబంధించి ఎదో ఒక వార్త అధికారికంగా వస్తూనే ఉంటుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది అనేది, షూటింగ్ లొకేషన్స్ లో మనం ఇది వరకే చాలాసార్లు చూసాము. ఫస్ట్ లుక్ లో కూడా ఆయన అదే రేంజ్ లో కనిపిస్తాడు, పెద్ద మార్పు ఉండదని అంటున్నారు. చూడాలి మరి నవంబర్ నెలలో రాజమౌళి ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు అనేది.
Kaala Bhairava to M9 News
“SSMB29 మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి… ఈ సినిమాలో కూడా…”#SSMB29 pic.twitter.com/sk0BfBB9JW
— M9 NEWS (@M9News_) October 24, 2025