Bigg Boss 9 Telugu Thanuja: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో టాస్కులు చాలా బోరింగ్ గా సాగుతున్నాయి. ఏది ఏమైనా భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో జరిగిన మార్పులు ఆడియన్స్ కి అసలు ఏమాత్రం నచ్చడం లేదు. ఆయన ఎలిమినేషన్ తర్వాతే షో మొత్తం డౌన్ అయిపోయింది. వైల్డ్ కార్డ్స్ చేత శ్రీజ ని అన్యాయంగా ఎలిమినేట్ చేయించినప్పుడే ఈ షో మీద ఆడియన్స్ లో సగానికి పైగా నమ్మకం పోయింది. ఇక భరణి ఎలిమినేట్ తర్వాత వచ్చిన మార్పులు షో పై మరింత ప్రభావం చూపిస్తోంది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు ని చాలా ఎంటర్టైన్మెంట్ తో లాగించొచ్చు. కానీ ఒక్క కంటెస్టెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ ని అందించలేకపోయారు. ఇమ్మానుయేల్ చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ,గొప్పగా వర్కౌట్ అవ్వడం లేదు. నిన్న అమర్ దీప్ మరియు అంబటి అర్జున్ హౌస్ లోకి వచ్చి ఎపిసోడ్ ని పైకి లేపే ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కుదర్లేదు.
ఇకపోతే కాసేపటి క్రితమే ఈరోజు రాత్రి ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో కెప్టెన్సీ కంటెండర్లు గా ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, నిఖిల్, తనూజ, పవన్ కళ్యాణ్, దివ్య నిఖిత ఉన్నారు. వీళ్ళందరికీ బిగ్ బాస్ క్యాప్ టాస్క్ ఇచ్చాడు. గత సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ ‘బోన్ టాస్క్’ ఆడాడు గుర్తుందా..?, ఈ టాస్క్ లో కంటెండర్లు మొత్తం బోన్ కోసం పరిగిస్తారు, ఎవరైతే ముందుగా బోన్ ని పట్టుకుంటారో, వాళ్ళు ఒకరిని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తారు. అలా చివరి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైతే చివర్లో మిగుల్తారో వాళ్ళే ఇంటికి కెప్టెన్ అవుతారు. సరిగ్గా అలాంటి టాస్క్ నే ఇక్కడ కూడా పెట్టారు.
ఇక్కడ ఏమైందంటే క్యాప్ ని ఎవరైతే ముందుగా పెట్టుకుంటారో, వాళ్ళు తమకు నచ్చిన హౌస్ మేట్ చేతిలో పెడుతారు. ఆ క్యాప్ ని అందుకున్న వాళ్ళు ఒకరిని కెప్టెన్సీ నుండి తప్పిస్తారు. ఈ టాస్క్ లో చివరి వరకు తనూజ మరియు ఇమ్మానుయేల్ నిలుస్తారు. చివరికి ఇమ్మానుయేల్ గెలిచి ఇంటికి కెప్టెన్ అవుతాడు. ఈ టాస్క్ లో అందరికంటే వీక్ గా ఆడిన కంటెస్టెంట్ తనూజ. కానీ చివర్లో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. హౌస్ మేట్స్ అందరూ ఆమెని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏమైంది అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి. చాలా మంది నెటిజెన్స్ ఇదంతా సీరియల్ యాక్టింగ్, చాలా ఓవర్ చేస్తుంది తనూజ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమె యాక్టింగ్ చేసిందా?, లేదా నిజంగానే స్పృహ తప్పి పడిపోయిందా అనేది తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.
