Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి. కెరియర్ మొదట్లో సీరియల్ ను డైరెక్ట్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటిని సక్సెస్ ఫుల్ గా నిలుపుతూ ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో కూడా ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా తను సొంతం చేసుకున్నాడు. ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. మహేష్ బాబు లాంటి నటుడితో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా ప్రపంచ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేయబోతుంది అంటూ అతను తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నాడు. మరి ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి తొందర్లోనే రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఈమధ్య రాజమౌళి(Rajamouli)కి మహేష్ బాబు (Mahesh Babu) కి మధ్య కొంచెం క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. రాజమౌళి చెప్పిన సీన్ లోని ట్రీట్మెంట్ కొంతవరకు మహేష్ బాబు మార్చమని చెప్పారట. దాంతో రాజమౌళి మహేష్ బాబు మీద కోపంతో ఉన్నారనే వార్తలైతే వస్తున్నాయి.
మరి మహేష్ బాబుకి సైతం స్క్రిప్ట్ మీద చాలా మంచి కమాండ్ అయితే ఉంటుంది. అయినప్పటికి ఆయన స్క్రిప్ట్ లో ఎలాంటి చేంజెస్ చెప్పడు. ఒకవేళ తను చేంజెస్ ఏదైనా చెప్పాడు అంటే అది చాలా వాల్యుబుల్ అయ్యే ఉంటుందని మహేష్ బాబు అభిమానులు భావిస్తున్నారు. మరి రాజమౌళి సినిమా స్క్రిప్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయింది అంటే ఆయన అసలు సినిమా స్క్రిప్ట్ గురించి పట్టించుకోడు. దాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు అనే రేంజ్ లో దాన్ని పక్కన పెట్టేస్తాడు.
ఇక మహేష్ బాబు ఇప్పుడు కొన్ని చేంజెస్ చెప్పడంతో ఇప్పుడు ఇద్దరి మధ్య కొంతవరకు క్రియేటివ్ డిఫరెన్సెస్ అయితే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. మరి తొందరలోనే స్టార్ట్ అవ్వబోతున్న రెండో షెడ్యూల్ ని వీళ్లిద్దరూ ఏకతాటి పైకి వచ్చి పూర్తి చేస్తారా? లేదంటే చేరొ దారి ఎంచుకొని రెండో షెడ్యూల్ ని కొంతవరకు డీలే చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
Also Read : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?