Mahesh Babu and Rajamouli : ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళ స్టార్ డమ్ ను అంతకంతకు విస్తరింపజేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో రాజమౌళి మొదటి స్థానంలో నిలిచాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనటువంటి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన 12 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో 100% సక్సెస్ రేట్ కలిగిన ఏకైక ఇండియన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి మరో మెట్టు పైకెక్కలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాడా? లేదా అనే విషయాల పైన కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఈజిప్ట్ మమ్మీలను నేపథ్యంలో కూడా కథ సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆఫ్రికన్ అడవిల నుంచి ఈజిప్ట్ మమ్మీ వరకు ఈ కథ సాగడానికి గల ముఖ్య కారణం ఏంటి?
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
అందులో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనేవి తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు అయితే ఇండియన్ ఇండస్ట్రీలో మనకు ఎవరూ కనిపించలేదు.
మరి ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క స్టార్ డమ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకు చాలామంది ప్రేక్షకులు సైతం అండగా నిలుస్తూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు లభిస్తుందా లేదా అనేది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!