https://oktelugu.com/

Balayya and NTR : ఆ విషయం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన బాలయ్య…వర్కౌట్ అవుతుందా..?

Balayya and NTR : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్ళకు మాత్రమే భారీ క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్ల సినిమాలకు ఎక్కువగా మార్కెట్ ఉంటుంది.

Written By: , Updated On : March 28, 2025 / 09:27 AM IST
Balayya , NTR

Balayya , NTR

Follow us on

Balayya and NTR : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్ళకు మాత్రమే భారీ క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్ల సినిమాలకు ఎక్కువగా మార్కెట్ ఉంటుంది. అందుకే ప్రతి హీరో కూడా సక్సెస్ వెనకలే పరిగెడుతూ ఉంటాడు. ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే ఒక్క ఫ్లాప్ వస్తే మాత్రం వాళ్ళను ఎవ్వరు పట్టించుకోరు. కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ మంచి విజయాలను సాధించే సినిమాలను చేస్తూ ఉంటారు…

నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ వరుస విజయాలను అందుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలావరకు హెల్ప్ చేశారనే చెప్పాలి… ఇక జూనియర్ ఎన్టీఆర్ (NTR) నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికి ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధమైతే లేదు. ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా వీళ్ళ వైఖరి సాగుతుంది. ఇక ఫ్యూచర్లో అయినా సరే వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలనేది ప్రతి ఒకరి కోరిక… ఇక ఇప్పటికే ఎన్టీఆర్ వరుసగా ఏడు విజయాలను సాధించి తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు విజయాలను అందుకొని సీనియర్ హీరోలెవరికి సాధ్యం కానీ రీతిలో ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు.

Also Read : కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుసగా ఏడు విజయాలను అందుకున్నాడు. బాలయ్య బాబు నాలుగు విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఇక అఖండ 2 (Akhanda 2 ) సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక రాబోయే మూడు నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించినట్లయితే బాలయ్య సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాబాయి, అబ్బాయి ఇద్దరు సక్సెస్ లోనే ఉన్నారు. కాబట్టి నందమూరి అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి బాలయ్య గతంలో ఎన్నడూ లేనట్టుగా వరుసగా నాలుగు విజయాలను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెసులన్నీ కూడా ఆయన అభిమానులను సంతోషంగా ఉంచుతున్నాయి. మరి రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి ఫ్యూచర్ లో బాలయ్య బాబు మార్కెట్ ను మరింత విస్తృతంగా పెంచుకోవాలని కోరుకుందాం…

Also Read : బాలయ్య రెండు సార్లు థియేటర్ లో చూసిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!