Mahesh Babu : ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. ఎన్నో ఏళ్ళ నుండి జరుగుతున్నవే. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) చేయాల్సిన ‘పుష్ప'(Pushpa Movie) సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) చేతుల్లోకి వెళ్ళింది అనే విషయం తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. అప్పట్లో మహేష్ బాబు, సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించారు. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆ సినిమా రద్దు అయ్యిందని మహేష్ బాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అదే సినిమా అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లి పుష్ప గా మారింది. ఇది మహేష్ బాబు రిజెక్ట్ చేసి మంచి పనే చేసాడు. ఒకవేళ చేసుంటే ఆయనకు అసలు సూట్ అయ్యేది కాదని ఈ ‘పుష్ప’ సిరీస్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు.
మహేష్ బాబు కి ఈ సినిమా సెట్ అవుతుందో లేదో కాసేపు పక్కన పెడితే అభిమానులు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి మహేష్ బాబు పుష్ప క్యారక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఒక వీడియో ని క్రియేట్ చేసి సోషల్ మీడియా లో విడుదల చేశారు. ఈ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరో ఈ సినిమా మహేష్ బాబు కి సూట్ అవ్వదు అని అన్నారు?, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. మహేష్ బాబు ఈ క్యారక్టర్ లో అదిరిపోయాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్రియేటివిటీ ని పెట్టుకొని వీళ్ళు ఇంకా ఆన్లైన్ లో ఎందుకు ఉంటున్నారు?, సినిమా ఇండస్ట్రీ కి వెళ్లిపోవచ్చు కదా అంటూ ఈ వీడియో ని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ ఊపేస్తున్న ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమధ్యనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొనబోతుంది. చివరి సారిగా వీళ్లిద్దరి పై రాజమౌళి హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో ఒక పాటని షూట్ చేసాడు. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే నెల నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన వారణాసి సెట్స్ లో మూడవ షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘పుష్ప’లో మహేశ్‌బాబు నటించి ఉంటే ఇలా ఉండేదా.. వీడియో వైరల్..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తున్నారు. వివిధ వీడియోలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. pic.twitter.com/DpENDXwiQi
— ChotaNews App (@ChotaNewsApp) June 17, 2025