https://oktelugu.com/

మహేశ్‌ మెచ్చిన తమిళ్‌ మూవీ..

కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతున్నది. కొన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మూడు నెలలుగా థియేటర్లు, షూటింగ్స్‌ ఆగిపోవడంతో పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో ఉంది. స్టార్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సంవత్సరం మొత్తం షూటింగ్స్‌తో బిజీగా ఉండే నటీనటులూ ఈ ఫోర్స్‌డ్‌ బ్రేక్‌లో రకరకాల వ్యాపకాలతో కాలం వెల్లదీస్తున్నారు. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు. ఎలాగూ ఖాళీనే కాబట్టి ఇంట్లోనే రకరకాల సినిమాలు చూస్తున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 19, 2020 / 07:13 PM IST
    Follow us on


    కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతున్నది. కొన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మూడు నెలలుగా థియేటర్లు, షూటింగ్స్‌ ఆగిపోవడంతో పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో ఉంది. స్టార్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సంవత్సరం మొత్తం షూటింగ్స్‌తో బిజీగా ఉండే నటీనటులూ ఈ ఫోర్స్‌డ్‌ బ్రేక్‌లో రకరకాల వ్యాపకాలతో కాలం వెల్లదీస్తున్నారు. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు. ఎలాగూ ఖాళీనే కాబట్టి ఇంట్లోనే రకరకాల సినిమాలు చూస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్బాబు అయితే ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండా కుటుంబానికే ఫుల్‌ టైమ్‌ కేటాయిస్తున్నాడు.

    Also Read:ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

    ఈ క్రమంలో ప్రతి రోజు వివిధ భాషలకు చెందిన మూవీస్‌ చూస్తున్నాడు మహేశ్. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ హవా నడుస్తుండడంతో ఎన్నో దేశాలకు చెందిన చిత్రాలను ఇంట్లోనే చూసే అవకాశం కలిగింది. అయితే, మరే చిత్ర నచ్చనంతగా ఓ తమిళ్‌ మూవీ మహేశ్‌ మనసు దోచేసింది. ‘ఓ మై కడవులే’ అనే మూవీ తనకు చాలా నచ్చిందని మహేశ్ తెలిపాడు. ఆ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రాన్ని చూశాడు మహేశ్. తనకు బాగా నచ్చడంతో వెంటనే ట్విటర్‌లో చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు.

    ‘ఓ మై కడవులే చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశా. మూవీలో అందరి పెర్ఫార్మెన్స్‌ సూపర్‌. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు అద్భుతంగా రాసి, బ్రిలియంట్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో అశోక్‌ చాలా సహజంగా కనిపించారు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. అశోక్‌ సెల్వన్‌, రితికా సింగ్‌ హీరో, హీరోయిన్లు తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ మూవీ తమిళ్‌లో మంచి విజయం సాధించింది. దీని డిజిటల్‌ రైట్స్‌ జీ5 సొంతం చేసుకుంది. కాగా, సౌత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభినందనలకు ‘ఓ మై కడవులే’ చిత్రం యూనిట్‌ హ్యాపీగా ఫీలైంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆశోక్‌ స్పందించాడు.

    Also Read: ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ

    ‘థాంక్యూ సో మచ్‌ సర్‌! నేను మీకు పెద్ద ఫ్యాన్‌. మా సినిమాను మీరు చూసి అభినందిచటంతో నేను ఇక్కడ డ్యాన్స్‌ చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా హీరోయిన్‌ రితికా సింగ్‌ (గురు ఫేమ్‌) ‘ఓ మై గాడ్‌. ఇది నిజమేనా? థాంక్యూ సో మచ్‌ సర్‌! మీ నుంచి వచ్చిన అభినందనలతో మాకు ఈ రోజు చాలా గొప్పగా మారింది’ అంటూ ట్వీట్‌ చేసింది. మహేశ్‌ అభినందనతో తన మైండ్‌ బ్లాక్‌ అయిపోయిందని డైరెక్టర్ అశ్వత్‌ పేర్కొన్నాడు.

    https://twitter.com/urstrulyMahesh/status/1284547359473467392