Balakrishna: నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు…వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్య ను ‘అఖండ 2’ సినిమా భారీ దెబ్బ కొట్టింది… బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి మనందరికి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో ‘అఖండ 2’ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో చాలామంది నందమూరి అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 2026వ సంవత్సరంలో ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినప్పటికి ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అయినా సరే 2026 చివరిలో బాలయ్య తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. బాలయ్య బాబు వరుస విజయాలకు బ్రేక్ వేయడం పట్ల తన అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఇక గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ ని బాలయ్య బాబు వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అలాగే కథ కూడా చాలా కొత్తగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ఈ సినిమాతో ఎలాగైనా సరే బాలయ్య భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
మరి బాలయ్య అనుకున్నట్టుగా ఈ సినిమా ఇయర్ ఎండింగ్లో వస్తుందా? లేదంటే నెక్స్ట్ ఇయర్ లో వస్తుందా? అనే దాని మీదనే కొంతవరకు కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ బాలయ్య మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… గోపీచంద్ మలినేని సైతం ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు…