ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలంతా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే స్టార్ డైరెక్టర్లందరూ స్టార్ హీరోలను తమ గ్రిప్ లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి(Rajamouli ), మహేష్ బాబు (Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక దాని కోసం మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసుకుని మరి అతన్ని బయటికి పంపించే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఒక వీడియో ని కూడా రిలీజ్ చేశాడు. మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు నెల కొకసారి వెకేషన్ కైతే వెళ్తూ ఉంటాడు. సినిమా పూర్తయ్యేంత వరకు వెకేషన్ కి వెళ్లాల్సిన పనిలేదు సినిమా ఒకటే ఆయన ప్రపంచంగా ఉండాలి. మిగతా దాన్ని పట్టించుకోవద్దు అని ఉద్దేశ్యంతోనే రాజమౌళి తన పాస్ పోర్ట్ ను తీసుకొని మరి తనను జైల్లో బంధీని చేసినట్టుగా చేసాడు. ఇక సినిమా అయిపోయేంతవరకు ఇటు వెళ్ళడానికి మహేష్ బాబుకి పర్మిషన్స్ అయితే రాజమౌళి ఇవ్వడం లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఇక దానికోసం సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ కు కండిషన్స్ పెట్టి తను ఎక్కడికి వెళ్లకుండా సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ మరికొద్ది రోజుల్లో స్పిరిట్ అనే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఇక ప్రభాస్ లుక్ ఎక్కడ రివిల్ అవ్వకుండా చూసుకోవాలని అనుకుంటున్నాడట…ఈ సినిమాలు లుక్ లోకి మారిన తర్వాత బయట అతను ఎక్కడ కనిపించకూడదనే కండిషన్స్ అయితే పెట్టాడట.
దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే హీరోలను దర్శకులు వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే కాకుండా బందీలుగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు ఆయా హీరోలకు భారీ సక్సెస్ లను అందిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ స్టార్ డైరెక్టర్లు చేస్తున్న సినిమాలతో మన స్టార్ హీరోలకు ఎలాంటి గుర్తింపు వస్తుంది. వాళ్ల వల్ల మన హీరోల ఇమేజ్ భారీ లెవెల్లో పెరగబోతుందా?
మరి వాళ్లతో సినిమాలు చేస్తున్నారు అంటే వాళ్ళ ఇమేజ్ ను రెట్టింపు చేసే సినిమాల చేసి వాళ్లకు కండ్లు చెదిరిపోయే భారీ రికార్డులను క్రియేట్ చేసే సినిమాని అందిస్తామని దర్శకులు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక వాళ్ల అభిమానులు సైతం వీళ్లతో సినిమా చేయడాన్ని ఆనందిస్తున్నారు అంటే వీళ్ళ కాంబినేషన్ కి ఎంత మంచి గుర్తింపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…