Mahesh Babu And Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఒకానొక టైమ్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ చిరంజీవి ఇమేజ్ ను దాటిపోయింది. తనే ఇక నెంబర్ వన్ హీరోగా మారుతాడు అంటూ కామెంట్లయితే వచ్చాయి. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆయన సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే తన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో సినిమాలైతే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో ‘తొలిప్రేమ’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా దర్శకుడు అయిన కరుణాకరణ్ తో మహేష్ బాబు ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.
Also Read: మలయాళీగా రేవంత్.. ఆ మంత్రం పనిచేస్తే.. జరిగేది అదే
అయినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు… కరుణాకరన్ తొలిప్రేమ తర్వాత యువకుడు సినిమా కథని మహేష్ బాబుకి వినిపించాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఆ కథ కి పెద్దగా ఇంప్రెస్ అవ్వకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయాడు. సుమంత్ ఆ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం విశేషం…
ఆ తర్వాత కరుణాకరన్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని కామెంట్స్ చేసినప్పటికి కార్య రూపం దాల్చలేదు. ఇక ఏది ఏమైనా కూడా కరుణాకరన్ లాంటి డైరెక్టర్ ని మిస్ చేసుకున్నందుకు మహేష్ బాబు కొంతవరకు ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. అప్పట్లో మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ కథలను ఆయన రెడీ చేసినప్పటికి అనుకోని కారణాలవల్ల సినిమాలైతే చేయలేదట…
ప్రస్తుతం కరుణాకరన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం తను పెద్దగా సినిమాల్ని చేయడం లేదు. మహేష్ బాబు మాత్రం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…
