Mahesh Babu and Ram Charan : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. చాలామంది సగటు ప్రేక్షకులు సైతం స్టార్ హీరోల సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల సినిమాలకు ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. అందువల్లే వాళ్ల సినిమాలు భారీ రికార్డ్ లను కొల్లగొడుతూ ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తూ ఉంటాయి…ఇక ఇది ఏమైనా కూడా భారీ విజయాలను అందుకోవడంలో వీళ్ళు ఎప్పుడు మొదటి వరుసలో ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా మహేష్ బాబు లాంటి నటుడు మరొకరు లేరనే అంతలా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు… మెగాస్టార్ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్(Ram Charan) సైతం చిరుత(Chirutha) సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డును సైతం బ్రేక్ చేసి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇక మెగా పవర్ స్టార్ గా తన ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వస్తున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.
అయితే మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… అయితే ఈ ఇద్దరికి ఒక విషయంలో మాత్రం సిమిలారిటీ అయితే ఉంది. అదేంటి అంటే వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే వాళ్లకి పెద్దగా నచ్చరో వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉండలేరట. కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరట…
కొంతమంది అత్యుత్సాహం చూపించే వాళ్ళ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగుతారు. మొత్తానికైతే ఇద్దరు ఇంట్రవర్ట్స్ అవ్వడం వల్లే వీళ్ళిద్దరి బిహేవియర్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుందని వీళ్ళను బాగా దగ్గరి నుంచి చూసిన కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.
ఇక ప్రస్తుతం వీళ్లిద్దరూ తమ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు. మహేష్ బాబు రాజమౌళి(Rajamouli) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తుంటే రామ్ చరణ్(Ram Charan) మాత్రం బుచ్చిబాబు(Buchhi babu) డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ సినిమాని ట్రై చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…