Tollywood Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎన్ని సినిమాలు చేసిన కూడా ప్రతి ఒక్క హీరో తమ ఎంటైర్ లైఫ్ లో ఒక డ్రీమ్ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయి ఉంటారు. ఇక ఎప్పటికైనా ఆ క్యారక్టర్ చేసి ఒక సక్సెస్ ని అందుకోవాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు. మన స్టార్ హీరోల యొక్క డ్రీమ్ రోల్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా మహేష్ బాబు గురించి చూసుకుంటే ఈయన డ్రీమ్ క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజు అంట.అవును మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఒక్క సారైనా ఆ పాత్ర లో నటించి మెప్పించాలని ఉంది అని ఆయన చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అయిన కృష్ణ గారు కూడా అల్లూరి సీతారామరాజు సినిమాతోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ ని చూస్తూ మహేష్ బాబు పెరిగాడు అందువల్లే తను కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలని డ్రీమ్ గా పెట్టుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రనైనా అలవోకగా చేసి మెప్పిస్తాడు. ఆయనకి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉంది అది ఏంటి అంటే శ్రీకృష్ణుడి లా కనిపించడమే ఆయన డ్రీమ్ రోల్ అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు. అయితే వాళ్ల తాత అయిన నందమూరి తారక రామారావు చాలా పౌరాణిక పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం కృష్ణుడి పాత్ర అంటే చాలా ఇష్టం అంట. అందుకే తను కృష్ణుడి పాత్ర లో నటించి మెప్పించాలని అనుకుంటున్నాడు…
రామ్ చరణ్ కి మాత్రం ఒక సూపర్ హీరో పాత్ర లో చేయాలని ఉందట.అదే తన డ్రీమ్ రోల్ అని కూడా తెలుస్తుంది. ఇక తొందర్లోనే ఈ పాత్రను కూడా చేస్తాను అని ఒక ఇంటర్వ్యూ లో తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు…