Gold Price Today : అమావాస్య సందర్భంగా బంగారం ధరలు కాస్త ఊరట ఇచ్చాయి. శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగాయి. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2032 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.57 డాలర్ల ట్రేడ్ అవుతోంది. అయితే దేశీయంగా బంగారం ధరలు తగ్గుతున్నయి. 2024 ఫిబ్రవరి 9వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 9న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,220 గా ఉంది. ఫిబ్రవరి 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,010తో విక్రయించారు. గురువారం కంటే శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,140 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,320గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,990 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,220 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,390 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,710తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,990 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,220తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,990తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,220తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,500గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరల్లో మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,500గా ఉంది. ముంబైలో రూ..73,500, చెన్నైలో రూ.75,000, బెంగుళూరులో 71,500, హైదరాబాద్ లో రూ.75,000తో విక్రయిస్తున్నారు.