Mahesh Babu and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇప్పటివరకు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా విషయంలో చాలామంది స్టార్ డైరెక్టర్లు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన మహేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సింది. కానీ మహేష్ బాబు ఆ కథని రిజెక్ట్ చేయడంతో అదే కథను అల్లు అర్జున్ తో ‘పుష్ప’ పేరుతో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ‘పుష్ప 2’ సినిమా అయితే 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో దీనికి భారీ గుర్తింపు అయితే లభించింది. మహేష్ బాబు మాత్రం ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు చాలా రోజులపాటు బాధపడ్డాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు అప్పుడు ఎలాగైతే సుకుమార్ సినిమాను రిజెక్ట్ చేసి బాధపడ్డాడో ఇప్పుడు అదే రేంజ్ లో బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసి బాధపడుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి బుచ్చిబాబు ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేయాల్సింది.
Also Read : ఎన్టీఆర్ కి ఏమైంది..? ఎందుకిలా అయిపోయాడు..అవేమి లుక్స్ బాబోయ్ అంటున్న నెటిజెన్స్!
కానీ అనుకోని కారణాలవల్ల ఎన్టీఆర్ కథను రిజెక్ట్ చేయడంతో బుచ్చిబాబు సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ ని కలిసి అతనికి కథను చెప్పి ఒప్పించాడు. మరి ఈ సినిమా మీద మొన్నటి వరకు అందరికీ కొన్ని డౌట్లు ఉన్నప్పటికి నిన్న వచ్చిన గ్లింప్స్ తో ప్రతి ఒక్కరికి ఒక్క కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించబోతున్నాడనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.
కాబట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే చూస్తున్న బుచ్చిబాబు ఈ సినిమాను భారీ విజయంగా నిలుపుతాడని మెగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు…ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇద్దరు రెండు మంచి సినిమాలను మిస్ అయ్యారు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథలో మరొక హీరో వచ్చి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరు వరుసగా సూపర్ హిట్ సినిమాలను మిస్ అయిపోతున్నారని వాళ్ళ అభిమానులు సైతం చాలా వరకు నిరాశ పడుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : జూనియర్ ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కుతుందా..? ఇదేమి ట్విస్ట్ సామీ!