spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Next Movie After Varanasi: మహేష్ బాబు వారణాసి తర్వాత చేయబోయే సినిమా...

Mahesh Babu Next Movie After Varanasi: మహేష్ బాబు వారణాసి తర్వాత చేయబోయే సినిమా మీద క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

Mahesh Babu Next Movie After Varanasi: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లోనే రాజకుమారుడు లాంటి భారీ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. ఇక ఒక్కడు సినిమాతో మరోసారి స్టార్ హీరోగా అవతరించిన ఆయన ఆ తర్వాత అతడు, పోకిరి లాంటి భారీ సక్సెస్ లను సాధించాడు. ఇక ఈ క్రమంలోనే తను చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఆయన స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా మాస్ సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. ఇక తనలోని కామెడీ యాంగిల్ ను సైతం బయటికి తీసి చేసిన ఖలేజా సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినా కూడా ఆయన ఎక్కడ డీలాపడకుండా వరుసగా కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే ఒక ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. అలాగే మహేష్ బాబు సైతం ఇప్పటివరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ యాక్టింగ్ ను ఈ సినిమాలో చూపించబోతున్నాడట.

Also Read: పవర్‌ హౌస్‌గా కరీంనగర్‌.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..

ఈ సినిమాలో ఆయన 5 క్యారెక్టర్ లను పోషిస్తున్నాడనే విషయాన్ని రాజమౌళి క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు గతంలో చేసినటువంటి తప్పులను మరోసారి రిపీట్ చేయకూడదని చూస్తున్నాడు. వారణాసి సినిమా తర్వాత ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేయాలని చూస్తున్నాడు.

అతనికి పాన్ వరల్డ్ లో మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి హాలీవుడ్ దర్శకుడు ఎవరైనా తనని సంప్రదిస్తే వాళ్ళతో సినిమాలు చేయడానికి కూడా తన సిద్ధంగా ఉన్నానని తన పీఆర్ టీమ్ ద్వారా తెలియజేస్తున్నారట. ఇక ఇప్పటివరకైతే అతనికే హాలీవుడ్ దర్శకులు ఎవరు కథనైతే వినిపించలేదు.

వారణాసి సినిమా నుంచి టీజర్ గాని, ట్రైలర్ గానీ వచ్చిన తర్వాత ఆయనకు అవకాశాలు భారీగా వస్తాయని ఆయన అనుకుంటున్నాడు… అందుకే వారణాసి తర్వాత ఏ సినిమా చేయాలి అనేది ఇంకా ఆయన ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు. ఇప్పటికే చాలామంది దర్శకులు తనను కలిసి కథలను వినిపిస్తున్నప్పటికి ఆయన ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Oktelugu Epaper