Mahesh Babu New Look Leaked: మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న అప్డేట్ లీక్ అయినా అది నిమిషాల వ్యవధిలో బాగా వైరల్ అయిపోతుంటాయి. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి చిన్న న్యూస్ కూడా లీక్ అవ్వకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కానీ సోషల్ మీడియా యుగం లో లీకులను ఆపడం ఎవరి వల్ల కాదు అనేది ఈ సినిమా ద్వారా రుజువు అయ్యింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలైన కొత్తల్లో ఒక వీడియో లీక్ అయ్యింది. అందులో మహేష్ బాబు లుక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కెన్యా రాజధాని లోని నైరోబీ ప్రాంతం లో జరుగుతుంది. నాన్ స్టాప్ గా విరామం లేకుండా సాగుతున్న ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు.
ఆయనకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. రింగుల జుట్టు తో ట్రెక్కింగ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా ఆయన లుక్ ఈ ఫొటోలో కనిపిస్తుంది. చూస్తుంటే మహేష్ బాబు ఈ సినిమాలో స్తంట్స్ మొత్తం డూప్ లేకుండా సొంతంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 50 ఏళ్ళ వయస్సు లో కూడా ఆయన అడ్వెంచర్స్ చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. సాధారణంగా ఏ హీరో అయినా ఇలాంటి షాట్స్ కి డూప్స్ నే వాడుకుంటారు. కానీ మహేష్ బాబు మాత్రం అందుకు అసలు ఒప్పుకోడు. 50 ఏళ్ళ వయస్సులో కూడా ఒళ్ళు హూనం చేసుకునేలా కష్టపడుతున్నాడు మహేష్ బాబు. ఇక ఈ చిత్రం విశేషాలకు వస్తే ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగుతున్న చిత్రం. ఇది వరకు ఈ సినిమా రెండు భాగాల్లో వస్తుందని కొందరు, లేదు మూడు భాగాల్లో వస్తుందని మరికొందరు విస్తృతంగా ప్రచారం చేశారు.
కానీ అవన్నీ ఫేక్ అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కేవలం ఒకే ఒక్క భాగంగా తెరకెక్కిస్తున్నారట. నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానుంది. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ లు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. చూస్తుంటే అసలు ఈ సినిమాలో మహేష్ బాబు కి హీరోయిన్ లేనట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు తీసిన ప్రతీ సన్నివేశం లో మహేష్ బాబు తో పాటుగా ప్రియాంక చోప్రా కూడా ఉంది. కానీ హీరోయిన్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. భవిష్యత్తులో అయినా రాజమౌళి హీరోయిన్ గురించి క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.
మహేష్ బాబు-రాజమౌళి మూవీ నుంచి మరో లీక్.. మహేష్ లుక్ షాకింగ్ #SSMB29
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ #SSMB29 షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా కెన్యా రాజధాని నైరోబీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు.… pic.twitter.com/wvPv9XLdmI
— OkTelugu (@oktelugunews) September 4, 2025