Mahesh Babu Mohanlal Combo: సినిమా ఇండస్ట్రీలో వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ గా నిలపడమే ప్రతి ఒక్కరి టార్గెట్…ఇక స్టార్ హీరోలైతే వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడానికి గొప్ప కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక దర్శకులు సైతం హీరోలకు మంచి విజయాలను అందించి వాళ్లు కూడా స్టార్ డైరెక్టర్స్ గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం సూపర్ స్టార్ గా ఎదగడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఘట్టమనేని ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్తున్న మహేష్ బాబు తన దైన రీతిలో సత్తా చాటుతూ మంచి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ప్రస్తుతం రాజమౌళి తో సినిమాను చేస్తున్న ఆయన ఈ సినిమా తర్వాత మరికొంతమంది దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే వాళ్ళందర్నీ లైన్ లో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు చెప్పే కథలను సైతం ఆయన అనుసరిస్తూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్తే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది అనే ధోరణిలో కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు తో పాటుగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటూ సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్…
Also Read: త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోలో వస్తున్న సినిమా ఆ మూవీ కి సీక్వెల్..?
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను సాధించి పెట్టాయి. మలయాళం లోనే కాకుండా ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఇక్కడ కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తెలుగులో అనువాదమై మంచి విజయాలను సాధించాయి.
ఇక మీదట కూడా భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు మోహన్ లాల్ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది. వీరిద్దరినీ కలిపి ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రణాళిక రూపొందించినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.
Also Read: ఎవరెన్ని చెప్పిన ‘వార్ 2’ లో ఎన్టీఆర్ సెకండ్ హీరోనేనా..?
ఇక మొత్తానికైతే మోహన్ లాల్ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాతనే మహేష్ బాబు – మోహన్ లాల్ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అది మెటీరియలైజ్ అయితే అవ్వలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే నిజంగా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించేదని అటు మహేష్ బాబు అభిమానులు, ఇటు మోహన్ లాల్ అభిమానులు కూడా తెలియజేస్తున్నారు…