Puri Jagannadh Vijay Sethupathi Movie: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఏ రేంజ్ గుర్తింపు ఉందో దర్శకులకు సైతం అలాంటి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతోంది. టాప్ డైరెక్టర్లందరు ప్రస్తుతం వాళ్ళ మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు. వారి నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడు సైతం ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇకగత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్లాపుల్లో ఉన్నారు.ఆయన ఎలాంటి సినిమాలు చేసిన ఇందులో సక్సెసు లైతే రావడం లేదు. అలాగే ఆయన పాన్ ఇండియా లో ఏ మాత్రం తన ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్నాడు…
Also Read: ఈ ఇయర్ విన్నర్ బాలయ్య ఏనా..? అఖండ 2 టీజర్ దానికి సంకేతమా..?
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ లాంటి విలక్షణ నటుడితో ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అయితే చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు పూరి అంటే మూడు ఫైట్లు, నాలుగు పంచ్ డైలాగులు గుర్తుకొచ్చేవి.. కానీ ఇప్పుడు తన పంథా ను మార్చుకొని సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో పూరి జగన్నాథ్ ఏ మేరకు విజయం సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
గతంలో పూరి జగన్నాథ్ చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు అతనికి భారీగా నష్టాన్ని మిగిల్చాయి. ఆ దెబ్బతో అతను కోలుకోలేకపోతున్నాడు. ఒకవేళ ఈ రెండు సినిమాలు కనక సూపర్ సక్సెస్ సాధిస్తే పూరి జగన్నాథ్ రేంజ్ మారిపోయేది… ఇక తన నుంచి ఒక సూపర్ హిట్ సినిమా వస్తే చూడాలని అతని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోలతో మంచి సినిమాలను చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన ఆయనకు ఇప్పుడు సరైన సక్సెస్ రాకపోవడం పట్ల అభిమానులు కొంతవరకు నిరాశాను వ్యక్తం చేస్తున్నారు…ఇక విజయ్ సేతుపతి అయిన పూరి సక్సెస్ ను తీసుకొస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…