Mahesh Babu , Sandeep Reddy Vanga
Mahesh Babu and Sandeep Reddy : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన తర్వాత సందీప్ రెడ్డివంగ నెంబర్ 2 పొజిషన్ ను కైవసం చేసుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఆయన చేసిన అనిమల్ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది ఇక మరో సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టి ఏకంగా నెంబర్ వన్ పొజిషన్ అందుకోవాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డివంగ ఉన్నట్టుగా తెలుస్తోంది…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే…ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తో ఒక భారీ యాక్షన్ సినిమాని చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబుకి కథ పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాని పట్టాలెక్కించలేదు. నిజానికి సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే కొన్ని బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి. వాటికి మహేష్ బాబు కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేకపోవడం వల్లే ఆ సినిమాని వదిలేసారట. కానీ అనిమల్ (Animal) సినిమా చూసిన తర్వాత మాత్రం సందీప్ స్టామినా ఏంటో అందరికీ అర్థమైంది. ముఖ్యంగా ఒక చిన్న స్టోరీ తో భారీ ఎలివేషన్స్ ని ఇస్తూ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిపిన విధానం అద్భుతమనే చెప్పాలి.
Also Read : రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్స్ చూస్తే స్టార్ హీరోలు సైతం షాక్ అవ్వాల్సిందేనా..?
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం సందీప్ వంగ భారీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మరి ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న సినిమాల గురించి యావత్ ప్రేక్షక లోకమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తన పేరును సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సందీప్ వంగ అంటే మాత్రం ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ప్రభాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలను చేయడానికి ఆయన ముందే ఫిక్స్ అయి ఉన్నాడు.
కాబట్టి దాదాపు ఆయన మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు బిజీగా ఉన్నాడనే చెప్పాలి. మరి ఆ తర్వాత ఆయన ఎవరితో సినిమాలు చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాల రిజల్ట్ ని బట్టి సందీప్ రెడ్డి వంగ తన తదుపరి సినిమాను ప్లాన్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది…