MLC Elections : తెలంగాణ(Telangana)లో ఒక పట్టుభద్రుల(Graduate) స్థానానికి, రెండు టీచర్(Teachers) ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం(ఫిబ్రవరి 27న) పోలింగ్ జరుగనుంది. ఈమేరకు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇక ఎన్నికల ప్రచారపర్వం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్(Poll Management)పై దృష్టిపెట్టారు. జాతీయ పార్టీల నుంచి స్వతంత్రుల వరకు అందరూ ప్రలోభాలకు తెరలేపారు. అయితే దొరికితే దొంగ అన్నట్లు.. తొలిసారి పొటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి అడ్డంగా దొరికిపోయారు. ఇన్నాళ్లూ మంచి నడవడిక నేర్పుతూ వచ్చారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు. తాను విద్యాసంస్థల ద్వారా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలలేదని స్పష్టం చేశారు.. కానీ, ఆయన టికెట్ తెచ్చుకోవడం నుంచి చివరకు పోల్ మేనేజ్‌మెంట్ వరకు అన్నీ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం.. బయటపడ్డ వీడియో.. వైరల్
టికెట్ కోసం రూ.30 కోట్లు..
ఓ పార్టీ తరఫున ఎమ్మెల్సీ టికెట్ సంపాదించడం కోసం పార్టీకి రూ.30 కోట్లు ముట్టజెప్పినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర నేతలను సంప్రదించకుండా నేరుగా ఢిల్లీ వెళ్లి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో అధిష్టానానికి భారీగానే ముట్టజెప్పారన్న ప్రచారం జరిగింది. ఇక టికెట్ వచ్చాక తెలంగాణ నేతలు ఆయనకు సహకరించలేదు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా భారీగానే ఖర్చు చేశారు. చివరకు రాష్ట్ర నేతలను ప్రచారానికి రప్పించేందుకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారని పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
చివరకు ఓటర్లునూ కొనేందుకు..
ఇక చిరవకు ఓటర్లనూ కొనుగోలుకు ఎత్తుగడ వేశారు. తన విద్యాసంస్థలకు చెందిన సిబ్బందిని రంగంలోకి దించారు. పార్టీ నేతలకు ఇస్తే డబ్బులు ఓటర్లకు చేరుతాయో లేదో అని.. తనకు నమ్మకస్తులైన విద్యాసంస్థల సిబ్బందితోనే డబ్బుల పంపిణీ మొదలు పెట్టారు. మంచిర్యాల–నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ రోబోస్ ప్లే స్కూల్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్లకు ప్రైవేటు టీచర్ల ద్వారా డబ్బలు పంపిణీ చేయించారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంచారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడకు చేరుకునే సరికి సిబ్బంది పారిపోయారు. ఇక పాఠశాలలో ఉన్న సిబ్బంది తలదాచుకుంటూ, మీడియాకు ముఖం చాటేస్తూ కనిపించారు. డబ్బుల పంపిణీపై ఎవరూ నోరు విప్పలేదు.
Also Read: ప్రతీనెల 22వేల కోట్లు అవసరం.. ఎక్కడ నుంచి తెచ్చేది.. దేనికెంతో చెప్పిన సీఎం రేవంత్ సార్!