https://oktelugu.com/

Hero Vijay: హవ్వా ఇదేం అవతారం.. అన్నీ గీయించుకొన్న స్టార్ హీరోను చూసి అంతా షాక్…

విజయ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేసి సూపర్ సక్సెస్ లను అందుకొని మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఈయన తెలుగులో చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో తెలుగులో మాత్రం ఆయనకు అంతగా గుర్తింపు అయితే రాలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : March 24, 2024 / 09:07 AM IST

    Hero Vijay

    Follow us on

    Hero Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయంగా కూడా రాణించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈయన చేయబోయేది చివరి సినిమా అని కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతి పనిలో తను బిజీగా ఉన్నాడు. అయితే ఇక రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన విజయ్ హెయిర్ స్టైల్ ని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏమాత్రం బాగాలేని ఆ హెయిర్ స్టైల్ ని తర్వాత సినిమా కోసం ఎలా వాడుకుంటున్నాడు అంటూ పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా లో ప్రస్తుతం విజయ్ ని ట్రొల్ చేస్తున్నారు…

    ఇక ఇది ఇలా ఉంటే విజయ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేసి సూపర్ సక్సెస్ లను అందుకొని మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఈయన తెలుగులో చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో తెలుగులో మాత్రం ఆయనకు అంతగా గుర్తింపు అయితే రాలేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో మాత్రం ఆయన మంచి గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. తుపాకీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆ తరువాత మరో సక్సెస్ ను సంపాదించలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన పార్టీని పెట్టి రాజకీయ ఎంట్రీ ఇస్తూనే తన చివరి సినిమాని ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.

    ఇక రీసెంట్ గా ఆయన చేసిన వారసుడు, లియో సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దానివల్ల ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇక ఇప్పుడు చేయబోయే చివరి సినిమాని చాలా కేర్ ఫుల్ గా చేసి సూపర్ డూపర్ సక్సెస్ గా దానిని ముగించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే విజయ్ రాజకీయంగా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే తమిళనాడు ఎన్నికల్లో ఈసారి చాలా కీలక మార్పులు జరగనున్నట్టుగా కూడా తెలుస్తుంది…