Mahesh Babu:: రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయనచాలా చాలా తక్కువ సమయంలోనే మారిపోయాడు. మరి అలాంటి గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న మహేష్ బాబు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం. ఇక ఎప్పుడైతే ఆయన పోకిరి (Pokiri) సినిమా చేశాడో అప్పుడు ఆయన కెరియర్ అనేది టోటల్ గా టర్న్ అయిపోయింది. అప్పటిదాకా సాఫ్ట్ గా కనిపించిన మహేష్ బాబు పోకిరిలో మాస్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో అప్పటినుంచి వరుస మాస్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక పోకిరి ఇండస్ట్రీ హిట్ ను సాధించిన విషయం మనకు తెలిసిందే. మరి అప్పటినుంచి ఇప్పటివరకు మహేష్ బాబు మరొక ఇండస్ట్రీ హిట్ అయితే దక్కించుకోలేకపోయాడు. శ్రీమంతుడు (Srimanthudu) బ్లాక్ బస్టర్ సక్సెస్ అయినప్పటికి బాహుబలి (Bahubali) సినిమా భారీ రికార్డును క్రియేట్ పెట్టింది. ఇక బాహుబలి రికార్డును ఆ సినిమా బ్రేక్ చేయలేక పోయిందనే చెప్పాలి.
Also Read : నాని ‘ప్యారడైజ్’ చిత్రం లో హీరోయిన్ గా డ్రాగన్ బ్యూటీ..రెమ్యూనరేషన్ ఎంతంటే!
ఇక ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి ఇండియాలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ పాన్ వరల్డ్ లో గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం అయితే దక్కుతుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
భారీ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు భారీ సాహసాలను ఎలాంటి డూప్ లేకుండా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడట…మరి ఆ షాట్స్ ని మనం సినిమా థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకుడికి ఒక థ్రిల్ ఫీల్ అయితే కలుగుతుందని మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి మహేష్ బాబు ఇంతకుముందు కూడా ఎలాంటి డూప్ లేకుండా కొన్ని స్టంట్లు అయితే చేశాడు. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ బాబుకి మంచి క్రేజ్ దక్కుంటుందనే చెప్పాలి. కానీ ఈ సినిమాలో ఆయన చేసిన స్టంట్స్ కి సైతం చాలా గొప్ప గుర్తింపు వస్తుందంటూ అభిమానులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు…