Paradise Movie : ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ సంచలన విజయం సాధించిన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రాన్ని అంత తేలికగా మర్చిపోగలమా..?, యూత్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి వెర్రిక్కిపోయారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కాయదు లోహర్(Kayadu Lohar) ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెని చూసి యూత్ ఆడియన్స్ అమ్మాయి అంటే ఇలా ఉండాలి రా అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఇక హీరో గా నటించిన ప్రదీప్ రంగనాథన్ వరుసగా రెండు సార్లు 150 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న ఏకైక యంగ్ తమిళ హీరోగా సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. తదుపరి చిత్రం హిట్ అయితే ఇక ఆయన తమిళనాడు యూత్ కి ఐకాన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఒకే సినిమాతో ప్రదీప్, కాయదు లోహర్ మంచి క్రేజ్ ని సంపాదించారు.
Also Read : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి..ఇప్పుడు వెయ్యి కోట్ల హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?
‘డ్రాగన్’ తర్వాత కాయదు లోహర్ ఇండస్ట్రీ లో పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు. అందులో భాగంగానే ఆమె అడుగులు ముందుకు వేస్తుంది. నేచురల్ స్టార్ నాని(Natural star Nani) కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) చిత్రం లో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించేందుకు స్కోప్ ఉందట. ఆమె ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు ఆమె తమిళ హీరో శింబు కొత్త సినిమాలో, అదే విధంగా జీవీ ప్రకాష్ కుమార్ హీరో గా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు లో రవితేజ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ, ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
‘డ్రాగన్’ మూవీ ప్రొమోషన్స్ సమయం లో ఈమె ఒక ఇంటర్వ్యూ లో హీరో ప్రదీప్ రంగనాథన్ తో లవ్ టుడే కాన్సెప్ట్ చేస్తుంది. ఒకరి ఫోన్స్ ఒకరు మార్చుకుంటారు. కాయదు లోహర్ ఫోన్ ని హీరో ప్రదీప్ చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే ఈమె తనపై తానే మీమ్స్ క్రియేట్ చేసుకొని మీమెర్స్ కి ఇస్తుందట. అందులో ఒక మీమ్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాయదు లోహర్ అని ఉంటుంది. ఆమె ఫన్నీ గా తనపై తానే చేసుకున్న ఈ మీమ్ ఇప్పుడు నిజం కాబోతుంది. వరుసగా అవకాశాలను సంపాదిస్తూ ముందుకు పోతున్న కాయదు, మరో రెండేళ్లలో సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు లో ఇంతకు ముందు ఈమె శ్రీవిష్ణు తో కలిసి అల్లూరి అనే చిత్రం చేసింది.